1. కాణిపాకం : వినాయకుడి మందిరం అనగానే ప్రముఖంగా గుర్తుకు వచ్చే ప్రదేశం కాణిపాకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో కాణిపాకంలో వినాయక దేవాలయం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం చోళరాజు కులోత్తుంగ చోళ 1 నిర్మించారని చరిత్ర చెబుతోంది. రోజురోజుకు ఈ విగ్రహం ఎత్తు పెరుగుతుంది అని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఇక్కడ వినాయకుడు స్వయంభువుగా వెలసిన భావి కూడా ..ఎప్పుడు గంగమ్మ తల్లితో కలకలలాడుతూ ఉంటుంది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఈ దేవాలయం ఇక్కడ నిర్మించబడింది.
2. ఊచ్చీ పిల్లయార్ దేవాలయం:ఈ దేవాలయం కేరళ రాష్ట్రంలోని తిరుచిరాపల్లి లో ఉన్న కోట పై విజయనగర సామ్రాజ్య రాజులు నిర్మించినట్లు తెలుస్తోంది. కావేరి నది తీరాన ఉన్న ఈ దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువనే చెప్పాలి.
3. గణపతిపూలే టెంపుల్:ముంబై నుంచి సుమారుగా 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి సమీపంలో రత్నగిరి అనే ఒక ప్రదేశం ఉంది. ఇక్కడ గణపతిపూలే దేవాలయం దాదాపు 400 ఏళ్ల క్రితమే నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. అంతే కాదు ఇక్కడ పశ్చిమ ద్వారా దేవుడిగా గణపతిని కొలుస్తారు.
4. విఘ్నహార్ టెంపుల్:పూణే నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుకాడి నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయాన్ని నిర్మించారు.. అందమైన ప్రకృతి మధ్య కట్టిన ఈ గుడి పై చెక్కిన శిల్పాలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి.
ఇక వీటితో పాటు పూణేలో ఉన్న దగ్దుసేథ్ హల్వాయ్ గణపతి టెంపుల్ , ముంబై లో ఉన్న సిద్ధి వినాయక దేవాలయాలు భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.