పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపం పార్వ‌తి త‌య‌యుడు గ‌ణ‌ప‌తి. తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించడమే కాకుండా సరైన మార్గంలో పయనించేందుకు మార్గ నిర్దేశం చేస్తాడని భక్తుల విశ్వ‌సిస్తారు. అలాంటి ప్రత్యేకతలు ఏక‌దంతుడిలో ఉన్నాయి. వినాయ‌కుడి పూజ‌లో మ‌నం `గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా` అనే ప‌దాన్ని అంటుంటాం. అస‌లు ఆ ప‌దం ఎలా వ‌చ్చింది.? దాని వెనుక ఉన్న క‌థ ఎమిటో తెలుసుకుందాం..



         పూర్వం మ‌హారాష్ట్ర‌లోని మోర్గాం ప్రాంతంలో జ‌రిగిన క‌థ ఆధారంగా అక్క‌డ ఉన్న ఓ రాజు కుమారుడు అమృతం సేవించి మ‌ర‌ణం లేని వాడిగా ఉంటాడు. దీంతో దేవత‌ల మీద‌కు దండెత్తి వ‌స్తాడు దీంతో బృహ‌స్ప‌తి గ‌ణనాథున్ని ర‌క్షించాల్సిందిగా వేడుకోగా పార్వ‌తి గ‌ర్భంలో జ‌న్మించి సింధురాసుడిని అంత‌మొందిస్తాన‌ని వ‌రం ఇచ్చాడ‌ట‌. అలా భాద్ర‌ప‌ద శుద్ద చ‌వితి రోజు వినాయ‌కుడు పార్వ‌తి కొడుకుగా పుట్టాడ‌ట‌. ఓ సంద‌ర్భంలో సింధురాసురుడి మిత్రుడైన కమలాసురుడు ప‌ర‌మ‌శివుడిపై యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు గణపతి నెమలి వాహనధారియై కమలాసురునితో యుద్ధం చేసి సింధురాసురునిపై బాణమేసి ఉదరం చీల్చ‌డంతో  చీల్చాడంతో  అత‌డి క‌డుపులోని అమృతం బ‌య‌ట‌కి రావ‌డంతో సింధురాసురు మ‌ర‌ణిస్తాడు.


      దేవతలు ఆనందంతో ఏక‌దంతుడిని కొలుస్తారు. అప్పటి నుంచి మోర్గాం వినాయ‌కుడి పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతూ వ‌స్తోంది. ఈ యుద్ధానికి నెమలి వాహనంపై వ‌చ్చిన విఘ్నేశ్రుడు సింధురాసురుడిని హతం చేశాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని మోర్గాం అని పిలుస్తారు. అలాగే అక్కడి గణపతి పుణ్యక్షేత్రంలో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ లంబోధ‌రుడిని పూజిస్తారు.


  అయితే, ఇంకొక వాద‌న ఏంటంటే ప్రాచీన భార‌త‌దేశంలో గ‌ణ వ్య‌వ‌స్థ ఉండేద‌ని, ప్ర‌స్తుతం ఉన్న దేశాధ్య‌క్షుడు ఎలాగో ఆ రోజుల్లో గణానికి అధిపతి అలా ఉండేవాడ‌ని కొంద‌రు అంటున్నారు. అతనినే గణపతి అని పిలిచేవార‌ట‌. ఇలా మౌర్యుల కాలంటో గ‌ణ‌ప‌తి ఉండేవాడ‌ని, వీరిని పిలిచేందుకు `గ‌ణ‌ప‌తి బ‌ప్పా మౌర్య‌` అనే వార‌ని కొంద‌రు హేతు వాదులు విశ్వ‌సిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: