హిందువులకు నమ్మకాలు ఎక్కువ కాబట్టే పూజించే దేవతలు కూడా ఎక్కువే.. అందుకే దేవతలను ముక్కోటి దేవతలుగా విభజించుకొని..హిందువులు పూజిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వీరి నమ్మకం చాలా గొప్పది.. హిందువులకు భక్తిశ్రద్ధలు ఎక్కువ కాబట్టి వారు ఒక సంఖ్యను ప్రత్యేకంగా ఆరాధిస్తారని చాలామందికి తెలియదనే చెప్పాలి. అంతే కాదు వారు ఏ పని చేసినా కూడా ఈ సంఖ్య తో ముడిపడి ఉంటుందట.. ఆ సంఖ్య ఎంత..? ఎందుకు అసలు ఆ సంఖ్యకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారు..? అనే విషయం గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


పురాతన కాలంలో పరిశోధనలు జరిగిన తరువాత ఈ సంఖ్య ఆధారంగానే భూమికి ,సూర్యునికి మధ్య ఉన్న దూరాన్ని కూడా చెప్పారట..ఆ సంఖ్యే108.. సూర్యుని చుట్టు కొలత, భూమి వ్యాసాన్ని కంటే 108 రెట్లు అధిక మట. అంతేకాదు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనిషి శరీరంలో కూడా 108 మర్మ స్థానాలు ఉంటాయి. అందులో   శ్రీ చక్రం మొదటిది.. శ్రీ చక్రంలో 54 పురుష స్థానాలు, 54 స్త్రీ అంతర్భాగాలు ఉంటాయట .మొత్తం కలిపితే 108.. ఇంట్లో శ్రీచక్రం  ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లి ,పాజిటివ్ ఎనర్జీ వస్తుందని విశ్వాసం.

అంతేకాదు నటరాజ స్వామి చేసేటటువంటి భంగిమలు కూడా 108. అష్టాదశ పురాణాలు కూడా 108. అంతేకాదు గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు , మంత్రాలు చదివేటప్పుడు కూడా 108 సార్లు చేయడం ఆనవాయితీ. ఇక మనలో ఉన్న దేవుడిని కలవడానికి మనం 108 మెట్లు దాటి వెళ్లాలని బౌద్ధులు చెబుతారు. అంతేకాదు భారతీయ ఒక అద్భుత గణిత పరిజ్ఞానానికి గుర్తుగా భావించవచ్చు. ముఖ్యంగా కొన్ని వేల సంవత్సరాల కిందట రుద్రాక్ష ,తులసీదళం ఇలా అన్నీ కూడా 108 అనే సంఖ్య తోనే ముడిపడి ఉంటాయి. అందుకే  ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే హిందువులు ఈ సంఖ్యకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: