సాధారణంగా ప్రతి ఒక్కరు వారంలో ఏదో ఒక రోజును ఇంటి వారంగా పూజిస్తూ.. ఆ రోజున ఇష్టమైన దేవుడికి నైవేద్యాలతో పూజ చేసి , కలశాన్ని ఉంచడం అలవాటుగా చేస్తూ ఉంటారు. ఈ కలశం మీద వుంచే కొబ్బరికాయలు ఆ తర్వాత ఏం చేయాలి ..? ఎక్కడ వేయాలి ..? అనే విషయాలు తెలియక సతమతమవుతూ ఉంటారు.. ఇకపోతే ఈ కలశం మీద ఉంచి కొబ్బరికాయను ఏం చేయాలి..? ఏం చేస్తే శుభం కలుగుతుంది..? అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

కలశానికి ఉపయోగించిన కొబ్బరికాయను నీటిప్రవాహం లో నిమజ్జనం చేయవచ్చు అని పండితులు చెబుతున్నారు.. ఇంటికి దగ్గర్లో నీటి ప్రవాహం లేనట్లయితే , ఏదైనా జలాశయంలో లేదా బావిలో నిమజ్జనం చేయవచ్చు అని చెబుతున్నారు.. ముఖ్యంగా నోములు, వ్రతాలు చేసే సమయంలో పీటపై పోసిన బియ్యం ను బ్రాహ్మణులకు ఇస్తూ ఉంటారు.. కాబట్టి ఆ బియ్యంతో పాటు కలశం మీద ఉంచిన కొబ్బరికాయను కూడా బ్రాహ్మణులకు  ఇవ్వడం వల్ల మనకు ఎలాంటి దోషం ఉండదని పండితులు చెబుతున్నారు.

ఇకపోతే వ్రతాలు, నోములు వంటి పూజాకార్యక్రమాలోనూ, అలాగే దేవాలయాలలో జరిగే దైవ కార్యాలలో కలశ ధారణ  అనేది తప్పకుండా జరుగుతుంది. ఆ సమయంలో వెండి చెంబును లేదా రాగి చెంబును కలశంగా ఉపయోగిస్తారు. ఈ చెంబును శుభ్రంగా నీటిలో కడిగి ,ఆ తర్వాత పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. ఇక ఈ కలశంలో నీరు పోసి అక్షింతలు, పసుపు, కుంకుమ ,పూలు , గంధం వేస్తారు.. మామిడి ఆకులతో కలశం పై చుట్టూ ఉండేలా పెట్టి , వాటి మధ్యలో కొబ్బరికాయను  ఉంచుతారు.. ఇక మామిడాకులు అందుబాటులో లేనివారు తమలపాకులను కూడా ఉంచవచ్చు.

ఇక కొబ్బరికాయకు వస్త్రాన్ని చుట్టి పూజ అయిన తరువాత, దేవాలయాల్లో అయితే పూర్ణాహుతికి వాడుతుంటారు.. ఇళ్లల్లో  అయితే కొబ్బరికాయలను బ్రాహ్మణులకు ఇవ్వడం లేదా నీళ్ళలో నిమజ్జనం చేయడం వంటివి చేయాలని పండితులు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: