ప్రకృతిలో మనకు రకరకాల రంగులతో కూడిన పువ్వులు లభ్యం అవుతుంటాయి..కానీ లక్ష్మీ అమ్మవారిని కేవలం ఆ ఒక్క పువ్వుతో మాత్రమే పూజించడంవల్ల ఆమె ప్రసన్నురాలై ఆమె కరుణ కటాక్షం మనపై ఉంటుందట. ఇక ఆ పువ్వు ఏదో కాదు.. దేవతలకు అత్యంత ప్రీతికరమైన పువ్వు సంపెంగ పువ్వు. ఇక ఈ సంపెంగ పూలు మనకు తెలుపు , పసుపు రంగులో లభ్యమవుతాయి.. ఆదిశేషుడు అయినా ఆ ఆది నారాయణుడికి ఈ సంపెంగ పువ్వు అంటే ఎంతో ప్రీతికరం..అందుకే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆమె స్వామికి ఎంతో ప్రీతికరమైన పువ్వుతో పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుందట.
నవరాత్రులు రాబోతున్నాయి.. దుర్గామాత స్వయంభువుగా వెలసి మూడురోజులపాటు దుర్గాదేవి అవతారం ఎత్తగా, మూడు రోజుల పాటు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి రూపాలను ధరిస్తూ తరువాత మూడు రోజులు సరస్వతి దేవి మాత రూపాలను ధరిస్తూ భక్తులకు అండగా ఉంటారు. అంతేకాదు అమ్మవారిని శాకంబరీ దేవి గా కూడా పూజిస్తారు.. రకరకాల కూరగాయలతో, పండ్లతో , పూలతో అమ్మవారిని ఎంతో అద్భుతంగా అలంకరించి ప్రసన్నం చేసుకుంటూ ఉంటారు.
ఇక పాడ్యమి రోజు నుంచి నవమి వరకు చండీ పారాయణం చేయడం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో పాజిటివ్ వేవ్స్ నెలకొంటాయి. యజ్ఞాలు, హోమాలు, కలశస్థాపన వంటివి చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షం అందరిపై ఉంటుందట. పూజించే మనసు నిశ్చలంగా అమ్మవారి ప్రసన్నం కై స్వచ్ఛమైన మనసుతో పూజ చేయడం వల్ల ఖచ్చితంగా ఆమె కటాక్షిస్తుంది అని పండితులు చెబుతున్నారు.