ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే దేవుడికి డబ్బు రూపంలో, కానుకల రూపంలో ఏదైనా సమర్పిస్తూ ఉంటాము. టెంకాయలు కొట్టడం ద్వారా ఎలాంటి ఫలితాలు అందుతాయో? టెంకాయ ని దేవుడు ముందర కొట్టడం వెనుక ఉన్న రహస్యం ఏమిటనే ఇదే ఇప్పుడు చూద్దాం.
మన పూర్వంలో గ్రంథాలయాల ప్రకారం, కొబ్బరికాయ బయట చుట్టూ ఉన్న భాగాన్ని మానవుని యొక్క కోపం, అహం అని అని తెలియజేయడం జరిగింది. లోపల భాగాన్ని అంతటిని.. స్వచ్ఛమైన, అమాయకమైన ఆలోచనలను కలిగి ఉండడం ఉన్నట్లుగా గ్రంథాలయాలలో తెలియజేశారు. అందుచేతనే దేవుని ముందు టెంకాయలు కొట్టడం వలన మనలో ఉన్న కోపాన్ని, అహాన్ని తీసుకొని స్వచ్ఛమైన మంచి ఆలోచనలను కలిగించు కోవడానికి మన దేవుడు దగ్గరికి వెళ్లి టెంకాయ కొట్టి వేడుకుంటున్నాము. అయితే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు.. అదేమిటంటే కేవలం కదా ఒకసారి కొడితే సరిపోతుంది కదా?
గుడికి వెళ్ళిన ప్రతిసారి కాయను కొట్టడం ఎందుకు అని ? అన్న అనుమానం కలుగవచ్చు. మనుషులంతా తేలికగా ప్రతికూల శక్తి కి బాగా ఆకర్షితులవుతారు. అందుచేతనే మనం దేవాలయాలకు వెళ్ళిన ప్రతి సారి మంచి జరగాలని కొబ్బరికాయను దేవుడు ముందు కొడుతూంటాం. కొన్ని సార్లు మనం అలా కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అది అశుభమని అందరూ భయపడుతూ ఉంటారు. అలా కుళ్ళిపోవడం వలన మనలో ఉండేటువంటి చెడు ఆలోచనలు అంతటితో పూర్తి అయినట్లుగా దాని అర్థమట.
ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇలా కొబ్బరికాయ కుళ్ళిపోతే.. కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని.. వీర కొబ్బరికాయను కొట్టడం వల్ల శుభం జరుగుతుందని కొంతమంది తెలియజేస్తున్నారు.