తెలంగాణా సాధన లో ముఖ్య భూమిక ను పోషించింది బ్రతుకమ్మ సంబరాలు. బ్రతుకమ్మ పండుగ ద్వారా ప్రజలందరూ మమేకమై జరుపుకుంటారు. రంగు రంగుల పుష్పాలతో మేరుపర్వతపు ఆకారంలో చక్కగా అలంకరించిన పూలతో బ్రతుకమ్మను చేసి బ్రతుకమ్మ చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ పాటలు పాడుతూ బ్రతుకమ్మను జరుపుకుంటారు. తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా బ్రతుకమ్మను చేసి బ్రతుకమ్మను ఆచరిస్తారు. బొడ్డెమ్మ తో మొదలు పెట్టి ఎంగిలి బ్రతుకమ్మ ను , సద్దుల బ్రతుకమ్మను ఏ రూపం ప్రత్యేకత దానిదే. తొమ్మిది రోజులు జరుపుకొనే ఈ బ్రతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో వదిలి నిమజ్జనం చేస్తారు. బ్రతుకమ్మ ను 1000 ఏళ్ళనుండి జరుపుకుంటున్నాబ్రతుకమ్మను ఎన్నో చారిత్రాత్మక విషయాలను , పురాణం ఇతిహాసాలను మేళవిస్తూ చారిత్రాత్మక పాటలు పాడుతారు.బ్రతుకమ్మ పాటలలో ప్రాచుర్యం పొందిన పాటలలో " బ్రతుకమ్మ బ్రతుకమ్మ ఉయ్యాలో " ఒకటి .
ఈ పాటలో మహిళలు తమ కష్టనష్టాలను, సుఖ దుఃఖాలను, ప్రేమ , బంధుత్వాన్ని , భక్తిని , ఆప్యాతలను , భయం మొదలగు ఫీలింగ్స్ ని ఇతరులతో పంచుకుంటారు. ఈ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారం లో ఉన్నాయ్ . బ్రిటిష్ పరిపాలన తరువాత నవాబులు , భూస్వాములు పెత్తందారీ తనం వచ్చాక నలిగిపోయిన తెలంగాణ సమాజం మహిళలు దుర్భర జీవితాన్ని అనుభవించారు. వారి అకృత్యాలను తాళలేక ప్రజలు నలిగిపోయారు. ఈ క్రమంలో ప్రజలు ఆత్మహయాలు చేసుకున్నారు. వారిని తలుచుకుంటూ తోటిమహిళలు విచారించే వాళ్ళు. వాళ్లకు స్మరించుకొంటూ పూలను బ్రతుకమ్మ లా పేర్చి బ్రతుకు అమ్మ అని దీవిస్తూ పాటలు పాడుతూ బ్రతుకమ్మను కొలిచేవాళ్ళు. బ్రతుకమ్మ బ్రతుకమ్మ ఉయ్యాలో పాటలో వుండే అంతరార్థం మరియు మర్మం ఇదే ...
బ్రతుకమ్మ పాట ఇలా కొనసాగుతుంది .
బ్రతుకమ్మ బ్రతుకమ్మ ఉయ్యాలో , బంగారు బ్రతుకమ్మ ఉయ్యాలో , నానోము పండింది ఉయ్యాలో, నీనోము పండిందా ఉయ్యాలో , మావారు వచ్చారు ఉయ్యాలో , మీవారు వచ్చిరా ఉయ్యాలో ....
ఇలా ఎన్నో విషయాలను ఈ పాటలో మేళవించి మహిళలు మమేకం అవుతారు. ఈ బ్రతుకమ్మలో ఎక్కువగా యువతులు మంచి భారత కోసం బ్రతుకమ్మ ను ఆచరిస్తారు .