క్రిందటి ఏడాది మాదిరిగానే భక్తులు ఎరుమేలి ద్వారా అటవీ మార్గంలో, ఫుల్మెడు మీదుగా స్వామి సన్నిధానానికి చేరుకోవడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. వాహన దారులు మాత్రం నిలక్కల్ వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. అక్కడి నుండి స్నానం కోసం పంపానదికి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ యాత్ర సందర్భంగా దేవాలయ అధికారులు, రవాణా, అటవీశాఖ, ఆరోగ్య, నీటివనరుల శాఖ ల మంత్రులు, పోలీసువారితో ముఖ్యమంత్రి చర్చలు జరిపి ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు. ఏదైనా ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు వస్తే వాళ్లకు ఖచ్చితంగా కరోనా పరీక్ష చేయించే ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. అలాగే దేవస్థానం ఓ స్మోక్ డిటెక్టర్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది.
ప్రస్తుతం కేరళలోనే దేశంలోని 60 శాతం కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ తీర్థయాత్ర సమయం కాబట్టి కఠిన మార్గదర్శకాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నిన్న ఒక్కరోజే కేరళలో 12288 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. వారిలో 141 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. అందుకే భక్తులు సరైన కరోనా జాగర్తలు ఖచ్చితంగా తీసుకుంటేనే అనుమతి ఇస్తామని ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. అలా కాని పక్షంలో ఎవరినైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి భక్తుల సంఖ్యను మితంగా అనుమతి ఇవ్వాల్సి వచ్చిందని, అది అర్ధం చేసుకొని సహకరించాలని పప్రభుత్వం వారిని కోరింది.