శని ఒకసారి తగులుకుందంటే ఏ పని జరగదు అంటారు. అనుకున్న పనిలేవీ జరగకపోయినా తలపై శని తాండవం చేస్తుంది అంటారు. కానీ అటువంటి శని గ్రహం ఇది మీ అదృష్టాన్ని ప్రకాశింపజేసి మిమ్మల్ని రాజుగా చేస్తుంది. శనికి కోపం వచ్చిందంటే నాశనం కూడా చేస్తుంది. ఇదంతా జాతకంలో శని స్థానం మీద ఆధారపడి ఉంటుంది. ఇతర గ్రహాల మాదిరిగానే శని కూడా ఇతర రాశుల వారితో ప్రయాణిస్తాడు. శని ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. శని రాశి సమయంలో వివిధ రాశి చక్రాలు ఉన్న వ్యక్తులు వివిధ పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది.

కొంతమందికి శని వాళ్ళ మంచి జరిగితే, మరికొంత మందికి మాత్రం కఠిన పరిస్థితి ఎదుర్కోవలసి ఉంటుంది. శని అశుభ స్థానం కెరీర్‌లో అంతరాయం కలిగిస్తుందని, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా మూడు విధాలుగా కష్టపడాల్సి ఉంటుందని నమ్ముతారు. శని దేవుని వల్ల మీ జీవితంలో అన్ని సమస్యలు జరుగుతున్నట్టు అన్పిస్తే ఇక్కడ పేర్కొన్న కొన్ని శని నివారణ చర్యల ద్వారా ఆయనను సంతోషపెట్టవచ్చు. ఫలితంగా అశుభ ప్రభావాలను వదిలించుకోవచ్చు. ఈ నివారణలు శని సంబంధమైన సమస్యలను తొలగిస్తాయి.

హనుమాన్ ఆరాధన
పురాణాల ప్రకారం శని దేవుడు హనుమాన్ కు తన భక్తులను ఎన్నడూ ఇబ్బంది పెట్టనని వాగ్దానం చేసాడు. కాబట్టి శనివారం హనుమాన్ ను పూజించండి. వారికి నైవేద్యం సమర్పించండి. హనుమాన్ చాలీసా, సుందరకాండ మొదలైనవి చదవండి.

రుద్రాక్ష ధరించండి
శని చెడు పరిస్థితుల కారణంగా మీ జీవితంలో ప్రతిదీ పాడైపోతుంటే, శనివారం లేదా సోమవారం గంగాజలంతో కడిగిన సత్ముఖి రుద్రాక్షను ధరించాలి. కొన్ని రోజుల్లో దాని శుభ ప్రభావాలను పొందడం ప్రారంభమవుతుంది. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి.

శని మంత్రాలు జపించండి
ఈ రెండు మంత్రాలను 'ఓం ప్రాం ప్రిం ప్రౌన్ సహ శనిశ్చరాయ నమః' మరియు 'ఓం శనిశ్చరాయై నమః' జపించండి. శనివారం కనీసం 2 నుండి 5, 7, 9, 11 సార్లు ఈ మంత్రాలను జపించవచ్చు. ఈ మంత్రాలు చాలా ప్రభావవంతంగా పని చేస్తాయని అంటారు. దీనితో పాటు పేదలకు దానం చేయండి.

రావి చెట్టుకు పూజ
శనివారం రావి చెట్టుని పూజించండి. రావి చెట్టు 33 వర్గాల దేవతల నివాసంగా భావిస్తారు. దీనితో పాటు శ్రీకృష్ణుడు రావి చెట్టును తన రూపంగా వర్ణించాడు. శని దేవుడు కూడా శ్రీకృష్ణుని గొప్ప భక్తుడు. అటువంటి పరిస్థితిలో శనివారం రావి చెట్టుని పూజించినప్పుడు శని  దేవుడు చాలా సంతోషంగా ఉంటారు. భక్తుల బాధలను తొలగిస్తారు. శనివారం ఆవనూనె దీపం వెలిగించి పీపాల్ చెట్టు కింద ఉంచండి.

ఆవ నూనెను దానం చేయండి
శనివారాల్లో ఆవనూనె దానం చేయండి. దానం చేసే ముందు దానిని ఒక పాత్రలో తీసుకుని అందులో మీ ముఖాన్ని చూడండి. అప్పుడు దానం చేయండి. శనివారం వరకు ఇలా నిరంతరం చేయడం ద్వారా శనికి సంబంధించిన సమస్యలు చాలా వరకు దూరమవుతాయి. ఇది కాకుండా ఆవనూనెతో రొట్టె తయారు చేసి శనివారం కుక్కకు తినిపించండి.


మరింత సమాచారం తెలుసుకోండి: