కలియుగంలో ఉండే పాపాలను కడగడానికి శ్రీ మహావిష్ణువు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం లో ఏడు కొండల పైన వెలసిన విషయం మనకు తెలిసిందే. ప్రజలు చేసిన పాపాలు దేవుడికి అంటకుండా ఏడు కొండల పైన వెలిశాడని మరికొంతమంది చెబుతారు.. దేవుడు ఎక్కడ వెలిసినా భక్తులు వదలరు అన్నట్టుగా తిరుమలలో ఏడు కొండల పైన వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు.


ఇకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒక ప్రదేశంలో నీటిలో తెలియాడట.అది ఎక్కడో ఇప్పుడు కూడా మనం ఒకసారి చదివి తెలుసు కుందాం.. ఇకపోతే శ్రీ వెంకటేశ్వరస్వామి ఏడు కొండల పైన వెలిశాడు కాబట్టి అంత దూరం వచ్చి తనను దర్శించుకోలేని కొంతమంది భక్తుల కోసం వివిధ ప్రాంతాలలో కూడా వెలిశాడని  ఎన్నో కథలు ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నాయి. అలాంటి వాటిలో ప్రసిద్ధి చెందిన ప్రదేశం కూడా ఒకటుంది అదే మన్యం కొండ..


మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న  మన్యంకొండ లో శ్రీ వెంకటేశ్వర స్వామి కొండపైన కొలువుతీరి భక్తులకు దర్శనమిస్తున్నాడు. కానీ ఈ మన్యం కొండను కొందరు భక్తులు చాలావరకు తెలంగాణ తిరుపతి, పేదల తిరుపతి లేదా రెండవ తిరుపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. అంతేకాదు కొన్ని సంవత్సరాల తరబడి సిద్ధులు , మునులు ఇక్కడ తపస్సు చేశారు కాబట్టి ఈ కొండను మునులు కొండగా పిలవడం ప్రారంభించారు. ఇకపోతే ఈ కొండ చుట్టూ అరణ్యం ఏర్పడం వల్ల కాలక్రమేణా ఈ కొండకు మన్యంకొండ అని పేరు వచ్చింది.
అయితే ఇక్కడ స్వామి వారిని ప్రతిష్టించడం ముందు నీటిలో తేలియాడిందట. ఆ పూర్తి విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


దాదాపుగా 600 సంవత్సరాల క్రితం తమిళనాడు రాస్తాం  శ్రీరంగం సమీపంలో అళహరి గ్రామ నివాసి అయిన అళహరి కేశవయ్యకు కలలో వేంకటేశ్వరుడు కనిపించి.. కృష్ణా నది తీరంలో మన్యంకొండలో వెలుస్తానని.. నీవు  అక్కడికి వెళ్లి ప్రతి రోజు పూజలు చేయాలని చెప్పడంతో అళహరి కేశవయ్య తన తండ్రి అనంతయ్య  కుటుంబసభ్యులతో కలిసి ఆ నదీ తీరాన ఇక  నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే కేశవయ్య ఒకరోజు కృష్ణా నది తీరంలో స్నానమాచరించి,  సూర్యభగవానుడికి నమస్కరించి, తన  దోసిలిలో అర్ఘం వదులుతుండగా..అప్పుడు చెక్కని శిలారూపంలో వున్న  శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కలలో వచ్చినట్టుగానే  కేశవయ్య దోసిలిలో వచ్చి నిలిచింది.ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్య పోయి, తిరిగి  తీసుకొచ్చి..మన్యం కొండపై శేషసాయి రూపంలోగల గుహలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. అప్పటి నుంచి భక్తులు భక్తిశ్రద్ధలతో కోరికలు కోరుతూ, వారి కోరికలను నెరవేర్చు కుంటూ స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: