ఇల్లు నిర్మించేటప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం మంచి అనుభవజ్ఞులైన పండితులని ఎంచుకోవాలి. అంతేకాకుండా అనుభవజ్ఞుడైన ఇంజనీర్ యొక్క సలహాలను కూడా తప్పక పాటించండి.
1). ముఖ్యంగా సరి సంఖ్యలో ఉండేలా ద్వారాలు చూసుకోవాలి. కిటికీలు బేసి సంఖ్యలో ఉండే విధంగా చూసుకోవాలి.
2). ఇంటి చుట్టూ ఉండే గోడకు అక్కడ నుంచి మెట్లు కట్టరాదు. కార్ పార్కింగ్ వంటి వాటికి కూడా రూము ఏర్పాటు చేయకూడదు.
3). ఇల్లు నిర్మించిన గోడకు,కాంపౌండ్ గోడకు ఎలాంటి కనెక్షన్ ఉండకుండా చూసుకోవాలి.
4). ముఖ్యంగా కాంపౌండ్ కట్టకూడదు మరియు ఇంటి గోడకూ ఆనుకొని బాత్రూం, పని మనుషులకు రూమ్ వంటివి నిర్మించరాదు.
5).ఇంట్లో ఉపయోగించే నీరు ఎప్పుడు నైరుతి వైపుగా వెల్లకూడదు.
6). ఇల్లు కడిగిన నీరు తూర్పు లేదా ఉత్తరం దిశగా వెళ్లేలా చూసుకోవాలి. పడమర, దక్షిణం వైపుకి నీరు వెళ్ళకూడదు.
7). ఇల్లు నిర్మాణం ఎప్పుడు చతురస్రాకారం, దీర్ఘచతురస్రాకారంలోనే ఉండాలి.
8). మన ఇంటి ముందర బోర్, గుంతలు వంటివి ఉండకూడదు.
9). వంట చేసుకునే గదిని ఆగ్నేయ మూలలో తూర్పు ముఖంగా ఉండే లా చూసుకోవాలి.
10). సంపు గుంతలు నైరుతి, ఆగ్నేయ, వాయువ్య దిశలో ఏర్పాటు చేస్తే చాలా కష్టాలు ఎదురవుతాయి.
11). ఇంటికి ఒకేసారి మూడు ద్వారాలు అసలు ఉండకూడదు.
12). ఇంటికి నాణ్యమైన సిమెంటును, ఇనుము కడ్డీలను మాత్రమే వాడండి.
ఇల్లు నిర్మించేటప్పుడు ఆవులు అక్కడికి వచ్చాయి అంటే వాటికి కొద్దిగా గడ్డి వేయడం, నీరు తాపడం వంటివి చేస్తే.. చాలా మంచిది. అంతేకాకుండా ఆవు గోమూత్రం, పేడ వేయడం చాలా మంచిది.అన్నిటినీ ఈ విధంగా ఉండేలా చూసుకోని మీ ఇంటిని నిర్మించుకుంటే సకల సిద్ధి లభిస్తుందట.