సనాతన హిందూ ధర్మం ప్రకారం ప్రతి ఒక్కటి ఆచితూచి ఆచరించాలి అని తెలిపిన విషయమే..ఇకపోతే సనాతన ధర్మంలో గరుడ పురాణాన్ని మహా పురాణం అని కూడా పిలుస్తారు అని అందరికీ తెలిసిన విషయమే.. మహా పురాణం లో పొందుపరిచిన అన్ని విషయాలను కూడా స్వయంగా శ్రీ మహా విష్ణువు చెప్పిన వాటిగా పరిగణిస్తారు హిందువులు. ఇక గరుడ పురాణంలో చెప్పిన అన్ని విషయాలను కూడా అర్థం చేసుకుని జీవితంలో ఆచరణలో పెట్టిన వ్యక్తులు సమస్యలకు దూరంగా ఉంటారట..

ఇకపోతే సాధారణంగా ఒక కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా చాలా భిన్నంగా ఉంటారు..అటు స్వభావం లో నైనా సరే , ఇటు ప్రవర్తన లోనైనా సరే.. ఒకరితో మరొకరికి పోలిక ఉండదు.. ఇంట్లో కుటుంబం పై ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఏదో ఒక కారణం చేత గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఇంట్లో శాంతి కరువవుతుంది.. ఇక మనుషుల్లో కూడా సమానం తగ్గిపోతుంది.. ఇక గరుడ పురాణం ప్రకారం మనలో ఉండే ఎన్నో చెడు అలవాట్లు ఈ పరిస్థితులకు దారితీస్తాయట.

వంటగదిని శుభ్రంగా ఉంచకపోవడం:
ఆనాటి కాలంలో అయితే ఎంత ఆలస్యమైనా సరే వంటగదిని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతనే నిద్రపోయేవారు.. కానీ ఈనాటి కాలంలో చాలా మందికి అలాంటి పట్టింపులు ఏమీ లేవు.. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇళ్ళల్లో పని మనుషులు ఉన్నారు కాబట్టి..వారు ఉదయం వచ్చేవరకూ రాత్రిపూట తిన్న కంచాల ను అలాగే వదిలేస్తున్నారు.. గరుడ పురాణం ప్రకారం రాత్రిపూట మురికి పాత్రలను అలాగే వదిలి వేయడం వల్ల అది పేదరికానికి సంకేతం.. అంతే కాదు గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.ఇంటిని అపరిశుభ్రంగా ఉంచడం:
ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది గృహిణులకు ఇంటిని శుభ్రం చేయడానికి కూడా సమయం లేదు.. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇల్లు శుభ్రంగా ఉండాలి అనేది చాలా ముఖ్యం.. ఇలా ఇల్లు శుభ్రంగా ఉండడం వల్ల వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.. గరుడ పురాణం ప్రకారం ఇంట్లో మురికి ఉంచితే లక్ష్మీదేవి దరిచేరదు.. ఖర్చులు పెరగడం, విభేదాలు రావడం వంటివి జరుగుతాయి..వ్యర్ధాలను అలాగే వదిలి వేయడం:
ఇంట్లో పాడైపోయిన వస్తువులు, తుప్పు పట్టిన ఇనుము లేదా ఫర్నీచరు లాంటివి వెంటనే తీసేయండి.. లేకపోతే ఇంట్లో వివాదాలు కష్టాలు కలుగుతాయట..ఈ తప్పులు కనుక మీరు చేస్తున్నట్లయితే వెంటనే మానుకోండి.లేదంటే తిప్పలు తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి: