ప్రతి పండుగకూ కొన్ని ఆచారాలను పాటిస్తారు. అలాగే కొన్ని విషయాలను అపశకునంగా భావిస్తారు. అయితే దీపావళి గురించి కూడా అలాంటి ఎన్నో శుభ విషయాలు చెబుతారు. దీపావళి ఆనందం, ఉత్సాహాన్ని తెస్తుంది. కాబట్టి దీపావళి రోజున షాపింగ్ చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీపావళి రోజున ప్రజలు ఇల్లు, నగలు మొదలైనవి కొంటారు, కానీ దీపావళి రోజున చీపురు కొనడం కూడా శుభప్రదం. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కానీ దీపావళి రోజు ఖచ్చితంగా చీపురును కొనాలి. ఎందుకు అనే విషయం తెలుసుకుందాం.

మత విశ్వాసాల ప్రకారం దీపావళి రోజున చీపురు కొన్న తర్వాత, పూజ చేసి మరుసటి రోజు నుండి ఉపయోగించాలి. చీపురు సరిగ్గా ఉపయోగించినట్లయితే జీవితంలో అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అని నమ్ముతారు. చీపురును అవమానిస్తే లక్ష్మి దేవిని అవమానించినట్లే అంటారు. చీపురు పాదాలపై పడకూడదు. చీపురుకు సంబంధించిన కొన్ని మత విశ్వాసాల గురించి తెలుసుకుందాం.

ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీ దేవి చీపురులో నివసిస్తుందని, కాబట్టి దీపావళి రోజున లక్ష్మి శాశ్వతంగా నివసించే చీపురును ఆలయంలో శుభ ముహూర్తంలో దానం చేయాలని చెబుతారు.
దీపావళి మాత్రమే కాకుండా ఏ రోజైనా చీపురు కొనుక్కోవచ్చు, కానీ శనివారం చీపురు కొనడం నిషిద్ధం. ఎందుకంటే శనివారం చీపురు కొనడం అశుభం.
అంతే కాదు మీరు కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే మీరు చీపురుతో మాత్రమే ఇంట్లోకి ప్రవేశించాలి.
బహిరంగ ప్రదేశంలో చీపురు ఉంచడం అశుభం అని చెబుతారు. ఇంటి ప్రధాన ద్వారం నుండి చీపురును ఎవరూ చూడకూడదు. చీపురు వాడకపోతే కళ్ల ముందు పెట్టుకోవద్దు. అంతే కాదు చీపురును ఉత్తరం వైపు దాచుకోవాలి.
పూజ గదిలో స్టోర్‌ హౌస్‌లో పడక గదిలో చీపురు ఎప్పుడూ ఉంచకూడదు. మీరు పడక గదిలో చీపురు ఉంచినట్లయితే అప్పుడు వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి.
దీనితో పాటు చీపురును ఎప్పుడూ నిలబెట్టకూడదు. చాలా కాలంగా వాడుతున్న చీపురు ఇంట్లో పెట్టుకోకూడదు. బదులుగా మీరు కొత్త చీపురు తీసుకురావాలి.
చీపురు ను పాదాలతో ఎప్పుడూ దాటకూడదు, చీపురును కాల్చకూడదు. అది లక్ష్మి తల్లిని అవమానించినట్టే. అంటే చీపురును ఎప్పుడూ ఏ విధంగానూ అవమానించకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: