దీపావళి పండుగ హిందువులు మాత్రమే కాకుండా దాదాపు అన్ని మతాల వారు కులమత భేదాలు లేకుండా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అన్ని వర్గాలు వారు కులమతాలకు అతీతంగా జరుపుకునే అతి తక్కువ పండుగలలో దీపావళి పండుగ కూడా ఒకటి. పిల్లలు, పెద్దలు అంతా కలిసి ఎంతో సంతోషంగా ఈ వేడుకను జరుపుకుంటారు. దీపావళి అనగానే ముఖ్యంగా గుర్తువచ్చేది టపాకాయలు. అయితే పండుగను సంతోషంగా అలాగే సురక్షితంగా జరుపుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు అసలు చేయకూడని పనులు, జాగ్రత్తలు చాలా ఉన్నాయి వాటిని గురించి తెలుసుకుందాం.

కరోనా కల్లోల సమయంలో అందరికీ శానిటైజర్ లు బాగా అలవాటు అయిపోయాయి. కానీ దీపావళి రోజున మాత్రం శానిటైజర్ లు అస్సలు వాడకండి. ఎందుకంటే శానిటైజర్ కు మండే స్వభావం ఎక్కువ.

 * టపాకాయలు ఆరు బయట ఇంటికి కాస్త దూరంగా కాల్చాలి. పూరి గుడిసెలు, కరెంటు స్తంభాలు, ఎండు గడ్డి వంటి చోట్ల టపాకాయలు పెల్చకండి.

*  కొన్ని టపాసులు పేలకుండా మధ్యలోనే ఆరిపోతాయి.అయితే అటువంటి టపాసులను తిరిగి వెలిగించే ప్రయత్నం చేయకండి ఇది చాలా ప్రమాదం. కొన్ని సార్లు బయటకు మంట కనిపించకపోయినా లోపల ఉన్న మందు మండుతూనే ఉంటుంది...అలా ఒక్కసారిగా పేలే అవకాశం ఉంది. అందుకే మధ్యలో ఆగిపోయిన టపాసులపై ముందు జాగ్రత్త కోసం కాస్త నీటిని పోయుట మంచిది.

*చాలామంది చిన్నారులు తమ జేబుల్లో చేతులు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. అయితే పెద్దవారు పిల్లల్ని ఒక గంట గమనిస్తూ ఇటువంటివి జరగకుండా చూసుకోవాలి.

*  పెద్ద పెద్ద బాణాసంచాలు లేదా కొత్త రకమైన టపాసులు పేల్చి ముందు...వాటి కవర్పై ఉన్న సూచనలు తప్పకుండా చదివి వాటిని పాటించడం సురక్షితం.

* సురసురాలు వంటివి కాల్చిన తర్వాత పక్కన నీటిలో కానీ ఇసుకలో కానీ వేయాలి. టపాసులు కాల్చే సమయంలో అందరూ పాదరక్షలు తప్పకుండా వేసుకోవాలి.

* అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే పెద్దలంతా కూడా తమ పిల్లలు టపాకాయలు కాల్చే సమయంలో చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: