స్కంద షష్ఠి 2021 తేదీ, శుభ సమయం
షష్ఠి తిథి నవంబర్ 09వ తేదీ ఉదయం 10:36 గంటలకు ప్రారంభం అవుతోంది. షష్ఠి తిథి నవంబర్ 10వ తేదీ ఉదయం 08:25 గంటలకు ముగుస్తుంది.
స్కంద షష్ఠి 2021: ప్రాముఖ్యత
స్కంద షష్ఠిని కంద షష్ఠి అని కూడా అంటారు. అన్ని షష్ఠి తిథిలు కార్తికేయ స్వామికి అంకితం చేసేశారు. అయితే కార్తీక మాసంలో శుక్ల పక్ష షష్ఠి అత్యంత ముఖ్యమైనదిగా పరిగణలోకి తీసుకుంటారు. ఇది దక్షిణ భారతదేశంలో ఉత్సాహంతో, గొప్ప భక్తితో జరుపుకునే పండుగలలో ఒకటి. ఆరు రోజుల పాటు ఉపవాసం ఉండి, భక్తులు సుర సంహారం రోజున ముగిస్తారు.
రాక్షసుడు సుర పద్మంతో యుద్ధానికి వెళ్లే ముందు కార్తికేయ శివుని ఆశీర్వాదం కోసం వరుసగా ఆరు రోజుల పాటు యజ్ఞం చేశాడని నమ్ముతారు. ఈ ఆరు రోజులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. సుర సంహారం రోజున స్కంద దేవుడు, మురుగన్ రాక్షసుడు సుర పద్మాన్ని ఓడించాడు. సుర సంహారం మరుసటి రోజు తిరు కల్యాణంగా జరుపుకుంటారు. షష్ఠి నాడు పూజలు, ఉపవాసాలు చేసే వారికి సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మురుగన్ కు సంబంధించిన అన్ని దేవాలయాలు స్కంద షష్ఠిని భక్తితో శ్రద్ధగా జరుపుకుంటారు. తిరుచెందూర్ మురుగన్ ఆలయంలో అత్యంత విస్తృతమైన, గొప్ప వేడుకలు జరుగుతాయి.
స్కంద షష్ఠి 2021: ఆచారాలు
ఉపవాసం అత్యంత ముఖ్యమైనది
ఉపవాసం సూర్యోదయం నుండి ప్రారంభమై మరుసటి రోజు సూర్య భగవానుని పూజించిన తర్వాత ముగుస్తుంది.
పాక్షిక ఉపవాసం పాటించేవారు సాత్విక ఆహారాన్ని మాత్రమే తింటారు.
స్కంద పురాణాన్ని భక్తులు పఠిస్తారు.
చాలా మంది భక్తులు స్కంద షష్ఠి కవచం పఠిస్తారు.
మురుగన్ ఆలయాలకు వెళ్తారు
ఈ ఆచారాలు, నిబంధనలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పూజలు చేయండి.