కార్తీకమాసం ఎంత పవిత్రతను సంతరించుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఆశ్వయుజ అమవాస్య రోజున దీపావళి ,ఆ మరుసటి రోజు వచ్చేది కార్తీక మాసం.. మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు హిందువులు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు లతోపాటు కార్తీక పౌర్ణమి వంటి పర్వదినాలలో మహాశివుడికి విశేష పూజలు చేస్తూ ఉంటారు. అయితే కార్తీక మాసాన్ని దేవ దీపావళి అని కూడా పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కార్తీకమాసం అంతా కూడా శివాలయాలలో దీపాలు వెలిగించి భక్తులు తమ కోరికలను కోరుకుంటూ ఉంటారు.కార్తీక పౌర్ణమి ముఖ్యంగా శివుడికి, విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన రోజు..అందుకే ఈ పర్వదినాలలో భక్తులు భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి, పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కార్తీకపౌర్ణమి రోజున మనం శివాలయంలో దీపం వెలిగిస్తే మనకు తెలిసి తెలియకుండా చేసిన కొన్ని పాపాలు తొలగిపోతాయి.అంతే కాదు కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని కూడా శాస్త్రం చెబుతోంది. కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారు జామున నదీస్నానమాచరించి ముందుగా పూజ గదిలో దీపం వెలిగించి , ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించాలి.రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో దీపారాధన చేయడం వల్ల సంవత్సరం పొడవునా దీపం పెట్టినంత పుణ్యం మనకు కలుగుతుందట. అంతేకాదు 365 వత్తులతో దీపాన్ని చేసి , దానిని అరటి దొన్నే పై ఉంచి దానిని నదిలో వదులుతారు. ఇక ఎవరైతే గుడికి వెళ్లలేని పరిస్థితిలో ఉంటారో అలాంటి వారు ఇంటి దగ్గర ఉన్న తులసికోట ముందు దీపం వెలిగించినా కూడా గుడిలో వెలిగించిన పుణ్యం లభిస్తుంది. అంతేకాదు దీపం పెట్టే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. ముఖ్యంగా హోమాలు చేయడానికి సమయం లేని వాళ్ళు అగ్ని స్వరూపం అయినటువంటి దీపాన్ని వెలిగించి ఆరాధించడం వల్ల అగ్ని ఆరాధన చేసినట్టు పుణ్య ఫలితం తప్పకుండా ఇంటి కుటుంబానికి మొత్తం లభిస్తుంది..ఉదయం సూర్యుడు ఉదయించక ముందే తులసి దగ్గర పెట్టే దీపం కార్తీక దామోదరుడికి చెందితే, దేవుని దగ్గర దీపం శివుడికి చెందుతుండట. శివ, కేశవులిద్దరికీ కార్తీకమాసం ప్రీతికరమైనది.. అంతేకాదు మనం దీపం వెలిగించే తైలం లో లక్ష్మీదేవి ఉంటుందట. అందుకే దీపారాధన కోసం నువ్వుల నూనెను ఉపయోగించడం శ్రేష్ఠం. అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు.. మండుతున్న అగర్బత్తి లేదా కర్పూరం వెలిగించాలి. అంతేకాదు దీపం వెలిగిస్తే ఉన్న సమయంలో దీపలక్ష్మీ నమోస్తుతే అంటూ నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి , కోరుకున్న కోరికలు నెరవేరుతాయని హిందువులు భావిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: