సాధారణంగా ప్రతి వారం ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంటి వారం రోజున పూజామందిరంలో కలశమును ఏర్పాటు చేసి ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు. పువ్వులు, నైవేద్యాలు అలంకరణలతో నిష్టగా లక్ష్మీదేవిని కలశ రూపంలో స్థాపించి పూజ చేస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా నిష్ఠగా పూజ చేయాలి.. ఎందుకంటే ఆమె స్వచ్ఛతను కోరుకునే గొప్ప దేవత కాబట్టి తనకు చేసే పూజలో ఎలాంటి పొరపాటు జరిగినా లక్ష్మీ దేవత అనుగ్రహించదు అనేది శాస్త్రం చెబుతోంది. లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు కలశం లో ఏమేమి వేయాలి..? కలశాన్ని ఎలా స్థాపించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


ముందుగా మనం అమ్మవారి పూజలో కలశ స్థాపన ఎందుకు చేస్తాము అనే విషయానికి వస్తే.. కలశం అనేది లక్ష్మీదేవికి ప్రతిరూపం.. కలశాన్ని మనం మట్టిపాత్ర, వెండి, రాగి, బంగారు ,  పంచలోహాలతో తయారు చేసిన పాత్రలను వినియోగించవచ్చు. లోహంతో తయారు చేసిన కలశ మైన మట్టితో తయారు చేసిన కలశం అయినా అది పృద్వితత్వానికి సంకేతం కాబట్టి, అందులో నీరు జలతత్వానికి సంకేతం.. కలశంలో పూర్తిగా నీటితో నింపము కాబట్టి శూన్య స్థితి ఆకాశ తత్వానికి సంకేతం.. ఇక మనం చదివే మంత్రం వాయుజనితం కు సంకేతం.. ఇక కలశం ముందు ఉంచే దీపం అగ్నితత్వానికి సంకేతం.. ఇలా పంచభూతాలను ఒకే చోటికి చేర్చి పూజించడం వల్ల అమ్మవారు ప్రసన్నం అవుతారు అని శాస్త్రం చెబుతోంది.


ఈ కలశాన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే.. ముందుగా పాత్రను శుభ్రంగా కడిగి ,పసుపు, కుంకుమలతో అలంకరించాలి. బియ్యం పోసి వేదికను సిద్ధం చేసిన తర్వాత చందనం ,పరిమళ ద్రవ్యాలు, పువ్వులు వేసి చక్కగా అలంకరించుకోవాలి. ఇక ఈ బియ్యంపైన కలశాన్ని పెట్టి అందులో నీరు పోసి మామిడి ఆకులు లేదా తమలపాకులు ఐదు లేదా ఏడు ఉండేటట్టు చూసుకొని వేయాలి. ఆకులు ఏవైనా సరే నిటారుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక వాటి పైన ఒక కొబ్బరికాయను పెట్టి దానికి రవికెల గుడ్డను వస్త్రంగా చుట్టాలి.. ఇక ఆ కొబ్బరికాయకు ముఖ స్వరూపం వచ్చేలాగా ముక్కు, కళ్ళు, కనుబొమ్మలు ,పెదవులు వంటివి అమర్చేలా పసుపుకుంకుమలతో దిద్దవచ్చు. ఇక అమ్మవారి రూపాన్ని కొబ్బరికాయకు తీసుకొచ్చిన తరువాత తోచిన నగలు మీరు అలంకరించవచ్చు.

ఇక ఈ కలశంలో ఏమి వేయాలి అంటే.. బియ్యము, జీడిపప్పు - ద్రాక్ష 5, రూపాయి నాణేలు 5 , ఖర్జూరం 1, జీడిపప్పు 8, ఒక నిమ్మరసం, ముత్యం , పగడం, వెండి వస్తువులు ఇవన్నీ కలశంలో వేయడం చాలా మంచిది

మరింత సమాచారం తెలుసుకోండి: