రాయలసీమ అనే పేరు వినగానే చాలామంది మనస్సులలో కాస్త భయం అనిపించినప్పటికీ, అక్కడి ప్రజలు ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు అనే సంతోషం మొదలవుతుంది.. ఫ్యాక్షనిజానికి రాయలసీమ పెట్టిన పేరు అయినప్పటికీ , ప్రేమ ఆప్యాయత లకు పుట్టినిల్లు అని కూడా చెబుతూ ఉంటారు.. మీరు ఎప్పుడైనా రాయలసీమ ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ మీరు తప్పకుండా దర్శించుకోవలసిన పుణ్యక్షేత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ముఖ్యంగా రాయలసీమ అనగానే అతి ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి గుర్తుకొస్తుంది.. ఏడు కొండల పైన వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. ఇక తిరుపతి తరువాత అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న పుణ్య క్షేత్రాలు మహానంది, శ్రీశైలం, అహోబిలం, యాగంటి, లేపాక్షి ఒంటిమిట్ట బాగా గుర్తింపు పొందాయి.. రాయలసీమ అనే ప్రాంతం 4 జిల్లాల సమూహం.. అనంతపురం , కడప,  కర్నూలు, చిత్తూరు జిల్లా లతో ఈ ప్రాంతం రాయలసీమ గా గుర్తింపు పొందింది.

ఈ ప్రాంతాలలో ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాల షూటింగులు కూడా జరిగాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు, విద్యాసంస్థలు ప్రధానమైన ఆలయాలు కూడా ఉన్నాయి.

శ్రీకాళహస్తి:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక  పట్టణం శ్రీకాళహస్తి. భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన ఈ పుణ్యక్షేత్రం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంటుంది. ఇక్కడ విశేషమేమిటంటే రెండు దీపాలు పెట్టినప్పుడు.. ఒక దీపం ఎల్లప్పుడూ గాలికి కదులుతూ ఉంటే.. మరొకటి నిశ్చలంగా ఉంటుంది. ఇక్కడ వేయి స్తంభాల గుడి, వాస్తు కలలు ,విశ్వబ్రాహ్మణ శిల్ప కళ ఇలా ప్రతి ఒక్కటి కూడా చక్కగా చూడవచ్చు.

మహానంది:కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ ప్రాంతంలో మహానంది ఉంది. పరమ శివుడి గర్భగుడిలో శివలింగం కింద ఉన్న భూభాగం నుండి ప్రతి సంవత్సరం పొడవునా స్వచ్ఛమైన ఔషధ గుణాలు కలిగిన నీరు ప్రవహిస్తుంది.. కాబట్టి ఈ నీటిలో స్నానం చేయడం వల్ల అన్ని రోగాలు పోతాయి అని పండితులు చెబుతున్నారు.

తిరుపతి:ప్రపంచంలోనే అతి ప్రాముక్యత సంతరించుకున్న తిరుపతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని తూర్పు కనుమల ప్రాంతంలో తిరుపతి ఉంది. అటు తమిళ వాసులకు ఇటు తెలుగు వాసులకు దగ్గరగా ఉంటూ భక్తులకు అండగా నిలుస్తున్నాడు  శ్రీ వెంకటేశ్వర స్వామి.

మరింత సమాచారం తెలుసుకోండి: