
భౌమ ప్రదోష వ్రతం రోజున శివుడిని, హనుమంతుడిని పూజించడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చని చెబుతారు. విశ్వాసాల ప్రకారం భౌమ ప్రదోష ఉపవాసం అపారమైన ఫలితాలను ఇస్తుంది. భక్తులెవరైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆ వెంటనే శివుడు సంతసించి భక్తులకు అనుగ్రహం ఇస్తాడు. అంతే కాదు భక్తుల కష్టాలన్నింటినీ తొలగించి వారి కోరికలన్నీ తీరుస్తారు. ఈ రోజు ఉపవాసంతో పాటు, కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా సులభంగా అప్పు నుంచి విముక్తి పొందవచ్చు.
భౌమ ప్రదోష వ్రతం శుభ సమయం : కార్తీక మాస శుక్ల పక్ష తిథి 16 నవంబర్ 2021 ఉదయం 10.31 గంటలకు ప్రారంభమవుతుంది. ర్తీక మాస శుక్ల పక్షం ముగింపు తేదీ 17 నవంబర్ 2021. మధ్యాహ్నం 12.20 గంటలకు ఉంటుంది. పూజా సమయం సాయంత్రం 6.55 నుండి 8.57 వరకు పూజాది శుభ ముహూర్తాలు. ప్రదోష ఉపవాసం ఎల్లప్పుడూ ప్రదోషకాల సమయంలో అంటే సూర్యాస్తమయం సమయంలో మాత్రమే జరుగుతుంది. ప్రదోష కాలానికి ముందు పూజ చేస్తే పూర్తి ఫలితాలు రావు.
అప్పును వదిలించుకోవాలనుకుంటే, అప్పుల బాధ నుండి విముక్తి పొందడానికి భౌమ ప్రదోషం రోజున హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేస్తే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. దీనితో పాట, ఈ రోజున మంగళదేవుని 21 లేదా 108 నామాలను పఠించడం ద్వారా మీరు త్వరగా రుణ విముక్తి పొందుతారు. ఇది జాతకంలో ఉన్న మంగళ దోషాన్ని శాంతింపజేస్తుంది.