మన భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి. ఇక అందులో ఎన్నో అద్భుతమైన కట్టడాలతో కట్టడం వల్ల అవి బాగా ప్రసిద్ధి చెందాయి. ఇక వీటిని చూసేందుకు ఇతర దేశాలు సైతం ప్రజలు పర్యటన పేరుతో పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ఇక అదే విధంగా కొన్ని ఆలయాలలో అంతుచిక్కని రహస్యాలు కూడా ఉన్నవి. వాటి గురించి తెలిసినప్పుడు అందరూ ఆశ్చర్య పోతూ ఉంటారు. అయితే తాజాగా ఇప్పుడు ఒక దుర్గా మాత ఆలయం గురించి ఒక విషయం తెలిసింది వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

ఇక దుర్గామాత ఆలయం కేవలం ఏడాదిలో 5 గంటల మాత్రమే ఆ దేవాలయాన్ని దర్శించుకునే అవకాశం ఉన్నదట. ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడ ఉంది వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇండియాలోని చత్తీస్ ఘర్ రాష్ట్రంలో గ్రియా బంద్ అనే జిల్లా నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండపై ఈ దేవి మాత ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక ఆలయం పేరు"నీరామ్ మతా దేవాలయం అని పిలువబడుతుంది"

ఈ దేవాలయంలో అమ్మవారిని ఏడాదిలో కేవలం ఐదు గంటలు మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం కలదు. ముఖ్యంగా ఈ ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. ఇక ఈ ఆలయంలో ఉన్న అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు కేవలం అగరబత్తులును, టెంకాయను మాత్రమే ఉపయోగించాలట. పువ్వులు, కుంకుమ వంటివి గుడి లోపలికి అసలు తీసుకొని రాకూడదు.

అది కూడా ఏడాదిలో చైత్ర నవరాత్రి నెలలోనే మాత్రమే అక్కడ గుడిలో ఉన్నటువంటి ఒక దీపం వెలుగుతుంది అన్నట్లుగా చెబుతూ ఉంటారు. అయితే ఇంతవరకు అది ఎలా వెలుగుతుంది అనే విషయం మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇక అంతే కాకుండా అక్కడే 9 రోజులపాటు నూనె లేకుండా ఆ దీపం వెలుగుతోంది అని కూడా సమాచారం. ఈ అమ్మ వారి ప్రసాదం కూడా ఆడవారు తీసుకోరట.

మరింత సమాచారం తెలుసుకోండి: