
పూర్వీకులు కోపంగా ఉన్నప్పుడు మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. డబ్బు లేకపోవటం వల్ల జీవితంలో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. సులభంగా గర్భం దాల్చక పోవడం లేదా గర్భస్రావానికి దారి తీస్తుంది. ఇలాంటివి జరిగితే అమావాస్య రోజున మీ పూర్వీకుల కోసం ఏదైనా పని చేయడం ద్వారా సులభంగా వారి ఆశీస్సులు పొందవచ్చు.
1- రావి చెట్టు నాటిన ఆలయానికి వెళ్లండి. ఆ చెట్టుకు పాలు, నీరు కలిపిన నీటిని సమర్పించండి. సాయంత్రం వేళ రావి చెట్టు కింద ఆవాలనూనె దీపం వెలిగించి ఆ చెట్టుకు ఏడుసార్లు ప్రదక్షిణలు చేసిన తరువాత తప్పులకు క్షమించమని పెద్దలను కోరుతూ క్షమాపణ చెప్పండి. ప్రతి అమావాస్యనాడు ఇలా చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఆ కుటుంబంపై పూర్వీకుల ఆశీస్సులు, చల్లని చూపులు ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
2- పూర్వీకులను సంతోషపెట్టడానికి, ఈ రోజు వారి తరపున శ్రద్ధ కర్మ, పిండ దానం మొదలైన వాటిని కూడా చేయవచ్చు. అలాగే బ్రాహ్మణులకు ఆహారం ఇవ్వండి. అవసరమైన వారికి సామర్థ్యం మేరకు ఉన్నదాంట్లో ఎంతోకొంత దానం చేయండి. కుక్కలు, ఆవులు, కాకులు, చీమలకు ఆహారం పెట్టండి. రావి చెట్టు దగ్గర కొంత భాగాన్ని ఉంచండి. దీని ద్వారా పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి.
3- అమావాస్య నాడు గోవుకు ఐదు రకాల పండ్లను తినిపించి సాయంత్రం పటిక చెట్టు కింద ఆహారం పెట్టాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు మరియు పితృ దోషం ముగుస్తుంది. ఇది ప్రతి అమావాస్యనాడు చేయాలి.
4- శివాలయానికి వెళ్లి ఆవు పాలు, గంగాజలంతో శివ లింగానికి అభిషేకం చేయండి. మీ చేతులతో రావి మొక్కను నాటండి. ఆవు పాలు, నీరు కలిపి ఈ మొక్కకు పోయండి. దీపం వెలిగించండి. ఈ మొక్కను క్రమం తప్పకుండా నీరు పోస్తూ జాగ్రత్తగా పెంచండి.
5- పూర్వీకుల విముక్తి కోసం, గీతలోని ఏడవ అధ్యాయాన్ని పఠించండి. వారి మోక్షం కోసం దేవుడిని ప్రార్థించండి. వారి తప్పులను క్షమించమని పూర్వీకులను అడగండి. దీనివల్ల పెద్దల అసంతృప్తి తగ్గుతుంది.