
ప్రజల్లో ఉండే మూఢనమ్మకం ఏమిటంటే.. సత్యనారాయణవ్రతం చేయకపోతే దోషం కలుగుతుంది అని నూతన దంపతులకు..వారి దాంపత్య జీవితంలో ఇబ్బందులు కలుగుతాయనే భయంతో ఈ వ్రతాన్ని జరిపిస్తూ ఉంటారు అనేది అందరి భావన. బ్రహ్మ ,విష్ణు, మహేశ్వరుల కలయికగా త్రిమూర్తుల రూపంగా సత్యనారాయణ స్వామి భూమిపై ఆవిర్భవించారు అని ఆయన అసాధారణమైన శక్తి కలిగి ఉన్నారు అని భక్తులు విశ్వసిస్తారు. ఇకపోతే కొత్తగా పెళ్లయిన దంపతులు వారి జీవన ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో సంతోషంగా సాగిపోవాలని వధూవరుల చేత ఈ వ్రతాన్ని చేయిస్తారు.
ఇకపోతే కొత్త కోడలితో సత్యనారాయణవ్రతం చేయించడం వాళ్ల ఊరిలో ఉండేవారు కూడా కొత్త కోడలిని చూస్తారు.. అలాగే కొత్త కోడలు కూడా ఊరి వారందరినీ చూడడం వల్ల ఆమెలో ఉండే భయం కూడా తొలగిపోయి.. అందరితో చక్కగా కలిసిపోతుంది.. ఇక తమ కోడలికి అందరినీ పరిచయం చేయడం అలాగే ఊరి వారికి తమ కోడలిని పరిచయం చేయడం శుభసూచకం గా చూస్తారు ఆ ఇంటి అత్తమామలు. అందుకే తప్పకుండా కొత్త కోడలితో ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. ఇక ఎవరైనా సరే ఈ వ్రతాన్ని వధూవరులు జరిపించడం వల్ల వారు జీవితంలో పడ్డ కష్టాలన్నీ తొలగిపోయి..అత్యున్నత స్థాయికి చేరుకుంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా చెబుతున్నారు.