తమిళనాడు రాష్ట్రం రాయవేలూరు సమీపంలోని శ్రీపురం వద్ద కొలువై ఉన్న ఓం శక్తి అమ్మ దేవస్థానంకు (దీనినే బంగారు దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు) తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం  పట్టువస్త్రాలు సమర్పించింది. దేవస్థానం తరపున అదనపు కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు టిటిడి  ప్రజా సంబంధాల అధికారి ప్రకటనలో తెలిజేశారు. శ్రీపురంలోని నారాయణి ఛారిటబుల్ ట్రస్ట్ గోల్డెన్ టెంపుల్ కు చెందిన ఓం శక్తి అమ్మ 46వ జయంతి సందర్భంగా తిరుమల శ్రీనివాసులు తీర్థ ప్రసాదాలు, పట్టు వస్త్రాలను సమర్పించారు. టిటికి చెందిన వేద పండితులు వేదఆశీర్వచనం చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ‌వారి ఆల‌య పారుపత్తేదార్  ఉమామ‌హేశ్వ‌ర్ రెడ్డి, సూప‌రింటెండెంట్  సురేష్‌   పాల్గొన్నారు. కాగా టిటిడి మీడియాకు అందజేసిన ఫోటోల్లో  ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఈ విషయాన్ని టిటిడి తన ప్రకటనలో పేర్కోనలేదు.శ్రీ‌నివాసమంగాపురంలో ముక్కోటి ఏర్పాట్లు :

తిరుపతి సమీపంలోని  శ్రీ‌నివాస‌మంగాపురంలో వెలసి ఉన్న క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 13న‌ వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా భ‌క్తుల‌కు విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌ని టిటిడి జెఈవో  వీర‌బ్ర‌హ్మం తెలిపారు. వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్ల‌పై అధికారులతో స‌మావేశం నిర్వ‌హించారు. అనంతరం  జెఈవో మాట్లాడుతూ వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల‌కు సౌక‌ర్యవంతంగా ఉండేలా క్యూలైన్లు, ల‌గేజి, సెల్‌ఫోన్ డిపాజిట్ కౌంట‌ర్లు ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. భ‌క్తుల‌కు త‌గిన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని, శ్రీ‌వారి సేవ‌కుల‌తో సేవ‌లు అందించాల‌ని సూచించారు. భ‌క్తులు కోవిడ్ నిబంధ‌న‌లు పాటించి స్వామివారి ద‌ర్శ‌నం చేసుకునేలా చూడాల‌న్నారు. కోవిడ్ నిబంధనల అమలులో ఎలాంటి  రాజీకితావివ్వరాదని, అదే సమయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, టిటిడి పబ్లిషింగ్ స్టాళ్లతో శ్రీవారి డైరీలు, క్యాలండర్లు, వివిధ పుస్తాకాలు విక్రయించాలని, అదేవిధంగా శ్రీవారి అగర్ బత్తీలు విక్రయానికి అందుబాటులో ఉంచాలని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ttd