ఈ పద్ధతులు ఇంట్లో పాటిస్తే.. ఇంట్లో లక్ష్మీదేవీ వస్తుందని, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతారని చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తొలగడంతోపాటు కుటుంబాల మధ్య సంబంధాలు కూడా మెరుగు పడతాయని చెబుతున్నారు. అయితే ఎలాంటి పద్ధతులు పాటిస్తే ఇంట్లో లక్ష్మీదేవీ ఉంటుందనే విషయాలను తెలుసుకుందాము. ఇంట్లో ఆడవాళ్లు నిద్రపోయే ముందు ఆవనూనెను తీసుకుని దక్షిణ దిక్కున రాయాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల సుఖసంతోషాలు కలుగుతాయని, ఇంట్లోని కుటుంబసభ్యులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.
అలాగే రాత్రి పడుకునేటప్పుడు దీపం లేదా చిన్న బల్బును ఇంట్లో వెలిగేలా చూసుకోవాలి. అలాగే ఇళ్లు మొత్తం చిందరవందరగా ఉండకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా రాత్రివేళ్లల్లో ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే.. ఇంట్లోకి లక్ష్మీదేవీ వస్తుందని పండితులు చెబుతున్నారు. రాత్రి వండుకుని తిన్న పాత్రలను కూడా క్లీన్ చేసుకోవాలని చెబుతున్నారు. అలా చేస్తే మంచిదని చెబుతున్నారు. కానీ చాలా మంది రాత్రి తినేసిన సామాన్లను అలానే వదిలేస్తారు. ఇలా చేస్తే ధనలక్ష్మీ ఇంట్లోకి రాదని చెబుతున్నారు. నెగిటివ్ ప్రభావం పడుతుందని, దీనివల్ల ఎన్నో అనర్థాలకు దారి తీస్తాయన్నారు. కాబట్టి రాత్రిపూట కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. అదేవిధంగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను గౌరవించాలి. తల్లిదండ్రులను, అత్తా మామలను గౌరవిస్తే లక్ష్మీదేవీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందన్నారు.