చాణక్యుడు చెప్పిన నీతి శాస్త్రంలో మనిషి ఆర్థికంగా రాణించడానికి, లక్ష్మీదేవీ అనుగ్రహం పొందే విషయాలను తెలియజేశాడు. మంచి అలవాట్లు కలిగి ఉంటే.. లక్ష్మీదేవీ కటాక్షం లభిస్తుందని, చెడు అలవాట్లు ఉన్న వ్యక్తి లక్ష్మీదేవీ దూరంగా ఉంటుందని పేర్కొన్నారు. అలా పేదరికం, ధనిక కుటుంబాలు ఉంటాయని, కొన్ని అలవాట్లును మార్చుకున్నట్లయితే.. మీరు కూడా ధనవంతులుగా మారొచ్చని చాణక్యుడి నీతి శాస్త్రం చెబుతుంది. అవేంటో తెలుసుకుందాం రండి.
ప్రతి రోజు దేవుడిని స్మరించడం..
ఇంట్లో పూజలు చేయడం ఎంతో మంచిది. పూజలు చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ జనరేట్ అవుతాయి. తద్వారా మనిషి ఆలోచనలు మంచి వైపు మరలుతాయి. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. నిత్యం పూజలు చేయడం.. దేవుడిని స్మరించడం వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఫలితంగా ఇంట్లోకి లక్ష్మీదేవీ వస్తుందని చాణక్యుడు తెలిపారు.
పరిశుభ్రమైన పరిసరాలు..
లక్ష్మీదేవీకి పరిశుభ్రమైన వాతావరణం అంటే ఎంతో ఇష్టమట. ఇంట్లో పరిశుభ్రత లేనట్లయితే లక్ష్మీదేవీ రావడానికి కూడా ఇష్టపడదు. విడిచిన బట్టలను ధరించే వారు, ఇంటిని మురికిగా ఉంచుకునేవారు, పళ్లు కూడా శుభ్రం చేసుకోని వారు, రాత్రి పూట తిన్న ఆహారపు గిన్నెలను క్లీన్ చేసుకుని వారి ఇంట్లో లక్ష్మీదేవీ ఎప్పటికీ రాదు. వీటితో ఆరోగ్య సమస్యలు తలెత్తి.. ధన నష్టాన్ని పొందుతారని పేర్కొన్నారు. ఇల్లు, వాకిలి శుభ్రంగా ఉంచుకుంటే ఈ సమస్యే ఉండదన్నారు.
తరచూ ఇంట్లో గొడవలు పడేవారు..
తరచూ ఇంట్లో గొడవలు పడే వాతావరణంలో లక్ష్మీదేవీ ఉండటానికి ఇష్టపడదంట. ఆ ఇంటిపై లక్ష్మీదేవీ అనుగ్రహం ఉండదని చాణక్యుడు తెలిపారు. లక్ష్మీదేవీ అనుగ్రహం పొందాలంటే కుటుంబంలో ప్రేమ, స్నేహ పూర్వక వాతావరణం ఉండాలని, ఇంట్లో పెద్దలను గౌరవించాలని అన్నారు. నిస్సహాయులకు సాయం చేయాలని.. అప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవీ వస్తుందని పేర్కొన్నారు.