ప్రస్తుతం మార్కెట్లో రకరకాల డిజైన్లతో బట్టలు అనేవి వస్తున్నాయి. ఎప్పటి ట్రెండుకు అప్పుడే బట్టలు ఫ్యాషన్ మార్చుకుంటూ వస్తుంటాయి. అలాంటి బట్టల  విషయంలో మనం చాలా తప్పులు చేస్తుంటాం. దీని ద్వారా జీవితంలో ఇబ్బందులు కలగవచ్చు. మరి ఈ బట్టల విషయంలో కలిగే ఇబ్బందులు ఏమిటో తెలుసుకుందామా..? అయితే మనం వాడే బట్టలు కొద్ది రోజులు వాడిన తర్వాత అవి పాత పడ్డాయని వేరే వ్యక్తులకు ఇస్తాం..  మరి అలా ఇవ్వొచ్చా.. దాన్ని దానం అంటారా..అయితే ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ట్రెండ్ కు తగ్గట్టు బట్టలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. మార్కెట్లోకి వచ్చిన వెంటనే మనం వాటిని కొంటూ ఉంటాం. అలా కొత్తవి కొన్నప్పుడు పాత బట్టలను మన ఇంట్లో పక్కన పడేస్తాం. అలా పడేసిన బట్టలు ఇంట్లో పేరుకుపోతే మనకు ఇబ్బందులు తలెత్తవచ్చు.

ఎందుకంటే పాత బట్టలు ఇంట్లో ఉంటే నెగటివ్ ఎనర్జీ వస్తుందని పెద్దలు చెబుతుంటారు. పాత బట్టలే కాదు పాత వస్తువులు ఏవైనా సరే ఇంట్లో కుప్పలా పెడితే నెగిటివ్ ఎనర్జీ తయారవుతుందని అంటుంటారు. మరి ఆ పాత బట్టలను ఏం చేయాలి. అయితే ఈ బట్టలను మనం ఎవరైనా పేదవారికి కానీ, అనాధాశ్రమంలో కానీ ఇవ్వాలి. అలా అయితే దాన్ని దానం చేసినట్టు అంటారా.. కాదు.. ఎందుకంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.  మనకు ఇబ్బందులు తలెత్తుతాయి అనే ఆలోచనతో ఆ బట్టల నువ్వు తీసేయాలి అనుకున్నావు. వాటిని పేదవారికి అందించావు. అది నువ్వు దానం చేసినట్టు అయితే కాదు. దానం అంటే నువ్వు కొత్త బట్టలు కొని వారికి అందిస్తే అది దానం అవుతుంది. బట్టల విషయంలో అలా ఇచ్చిన వారికి దానం అనకూడదని పెద్దలు చెబుతున్నారు. మనం బట్టలను కూడా దానం చేసేటప్పుడు  అవి చిరిగిపోయి, దుమ్ము పట్టి, ఉన్నప్పుడు వాటిని అలాగే వేరే వారికి ఇవ్వకూడదు. ఆలా ఇచ్చినా కూడా మనకు ఇబ్బందులు తలెత్తుతాయి.

అలాగే ఒక్కోసారి మనమేమైనా పంచ లాంటి దుస్తువులు  కొనుక్కొని  వాటిని అలా కట్టుకొని  ఒక్క నిమిషంలో విడిచి వేసినా అది కట్టుకున్న బట్టలు అవుతాయి. మనం వీటిని మనకు తెలిసిన కొంతమందికి కొత్త బట్టలుగా ఇస్తాం. అలా కట్టుకుని ఇలా విడిచాం కదా అది పాతదే ఏం కాలేదు లే అనుకోని వాటిని మనకు తెలిసిన పండితునికి, మన ఇంటికి వచ్చే పెద్దలకు అందిస్తాం. అలా అందించడం మంచిది కాదు. దాన్ని నువ్వు డ్రై క్లీనింగ్ చేసి ఇచ్చిన అది పాపమే. అది దానం కిందికి రాదు.  కాబట్టి మనం బట్టల విషయంలో తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: