ఈ సమతామూర్తి కేంద్రానికి 2014లోశంకుస్థాపన జరిగింది. దీని నిర్మాణం 6 ఏళ్లలో నిర్మాణం పూర్తయింది. సుమారు 12 వేల కోట్ల రూపాయలతో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు. భద్రవేదిపై 216 అడుగుల ఎత్తులో శ్రీరామానుజచార్యుల విగ్రహం కొలువుదీరింది. భద్రవేదిపై 27 అడుగుల పద్మపీఠం ఉంటుంది. ఈ పద్మపీఠంలో 36 ఏనుగులు, 108 పద్మదళాలు ఉన్నాయి. 108 అడుగుల వెడల్పుతో వృత్తాకారంలో పద్మదళాలను ఏర్పాటు చేశారు.
పద్మపీఠంపై ఉన్న శ్రీరామానుజచార్యుల విగ్రహం ఎత్తు 108 అడుగులు.. శ్రీరామానుజచార్యులు ఆసీనులైన పద్మపీఠం చుట్టు కొలత 108 అడుగులు.. శ్రీరామానుజచార్యుల చేతిలో త్రిదండం ఎత్తు 153 అడుగులు, బరువు 60 వేల కిలోలు.. త్రిదండంపై ఉన్న జల పవిత్రం 6 వేల కిలోలు.. భద్రవేదిపై ఉన్న సమతామూర్తి విగ్రహం దిగువన మూడంతస్తులు నిర్మించారు. 63 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 90 స్తంభాలతో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మించారు.
90 స్తంభాలపై రామానుజచార్యుల జీవిత చరిత్రను తెలిపే చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆగ్మెంటెడ్ రియాల్టీతో స్తంభాలపై రామానుజచార్యుల చిత్ర కళాప్రదర్శనకు ఆస్కారం ఉంది. భద్రవేది మొదటి అంతస్తులో రామానుజచార్యుల 120 కిలోల బంగారు విగ్రహం ఉంటుంది. ప్రసన్న శరణాగత మండపంగా మొదటి అంతస్తుకు పేరు పెట్టారు. రామానుజులు 120 సంవత్సరాలు జీవించారని గుర్తుగా 120 కిలోల బంగారంతో సువర్ణమయ మూర్తిని తయారు చేయించారు. 36 అంగుళాల ఎత్తైన పీఠంపై 54 అంగుళాల ఎత్తులో బంగారు విగ్రహం ప్రతిష్ఠాపన చేశారు.