భారతీయ సాంప్రదాయ ప్రకారం మనం ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ తల్లికి ప్రత్యేక పూజలు చేసి వస్త్రాలు సమర్పిస్తాం. ఇందులో ప్రత్యేకంగా అమ్మవారికి చీర అనేది ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అయితే ఆ అమ్మవార్లకు పెట్టినటువంటి చీరకు చాలా విశిష్టత ఉంది. మరి అవేంటో తెలుసుకుందామా..?  అమ్మ వార్లకు కానీ స్వామివార్లకు కానీ వస్త్రాలను కట్టి తీసివేసిన వాటిని శేషవస్త్రాలు అంటారు. శేషము అంటే మిగిలినది అని అర్థం.
 అంటే వాళ్ళు ధరించిన తర్వాత మిగిలినది అని ప్రసాదం లాంటిదని అర్థం. ఈ వస్త్రాలను కూడా మూడు రకాలుగా మనం కట్టుకుంటాం. మనం షాప్ లో కొనుక్కుని దాన్ని కట్టుకుంటాం అది కూడా వారి ప్రసాదమే. రెండవది మనం ఎప్పుడైనా కొత్తబట్టలు తెచ్చుకుంటే అది దేవుడి దగ్గర పెట్టి వచ్చిన తర్వాత వేసుకుంటాం.

కొంతమంది వస్త్రాలు వాళ్ళని తీసుకువెళ్లి ఒకసారి స్వామి దగ్గర పెట్టి తర్వాత వాడుకుంటారు. ఇందులో మరో విధానం ఏందంటే అమ్మవారికి లేదా స్వామివారికి కట్టినటువంటి బట్టలను మనం ధరించడం. మరి వాటిని ఎలా ధరించవచ్చా.. లేదా.. ధరిస్తే ఏం జరుగుతుంది. అయితే భారతీయ సాంప్రదాయం ప్రకారం అమ్మవార్లకు సమర్పించినటువంటి వస్త్రాలను చాలా వరకు  వేలం ద్వారా కానీ ఏదో ఒక విధంగా మాత్రమే అమ్మేస్తారు. ఈ సమయంలో వచ్చినటువంటి డబ్బును ఆలయ అభివృద్ధికి ఉపయోగించాలి కానీ పక్కదారి పట్టిస్తే పాపమని ఆధ్యాత్మిక నిపుణులు తెలుపుతున్నారు. కొన్ని దేవాలయాల నుంచి శేష వస్త్రాలు ఒక్కోసారి మనకు గిఫ్ట్ రూపంలో పంపిస్తారు. అయితే ఈ వస్త్రాలను మనం ఏదైనా పుణ్యకార్యాలు, పూజలు చేసేటప్పుడు మాత్రమే ధరించాలని చెబుతున్నారు. అయితే మనం అలా వచ్చినటువంటి వస్త్రాలను దరించవచ్చు. ఇది మనకు చాలా మంచిది. అలాగే కొన్ని సమయాల్లో మైల, మలమూత్ర విసర్జనలు, అలాగే ఎవరైనా చనిపోతే వెళ్లడం ఇలాంటివి వచ్చినప్పుడు ఈ వస్త్రాలను కట్టుకొని ఉంటే మళ్లీ తీసి వేయాలా అని అంటే మాత్రం అవసరం లేదు.

ఎందుకంటే ఇవి ప్రకృతికి సంబంధించిన విషయాలు ప్రకృతితో ముడిపడి ఉంటాయి. కాబట్టి అలాంటి వాటికి వెళ్లినప్పుడు మళ్లీ వాటిని శుభ్రం చేసుకొని వాడుకుంటే సరిపోతుంది. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మనకు అమ్మవారు నుంచి వచ్చినటువంటి వస్త్రాలను ధరించడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. వీటి ద్వారా మనకు ఎంతో పుణ్యం, కుటుంబ సమస్యలు కూడా తీరిపోతాయి. ఎన్నో ఆరాధనలు, పూజలు చేసినటువంటి ఆ వస్త్రాలు మనకు చక్కటి ఆహ్లాదకరమైన జీవితాన్ని అందించడంలో ఎంతో సహకరిస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: