ఈ రోజు ఇల్లు దులిపితే  లక్ష్మి దేవి ఇంట్లో నుండి వెళ్లి పోతుందా..? లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఏ నియమాలు పాటించాలి..? శుక్రవారం రోజు ఇల్లు దులపకూడదని ఎందుకంటారు..? ఇంటికి ఇల్లాలే లక్ష్మీదేవి స్వరూపం అంటారు. మరి అలాంటి లక్ష్మీస్వరూపమైన ఇల్లాలు శుక్రవారం పూట ఇల్లు దులపచ్చా? ఇటువంటి సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరు ఆరాటపడతారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లేమి అనే కొరత ఉండదు. సుఖ సంతోషాలతో ఉంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలామంది చాలా రకాల పూజలు చేస్తూ ఉంటారు.
శుక్రవారం అయితే ఇల్లంతా కళగా అలంకరిస్తారు. సాధారణంగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి గడపకు పసుపు రాసి పువ్వులతో  అలంకరిస్తారు. అలాగే ఇంట్లో ఉన్న దేవుని గదిని కూడా పువ్వులతో చక్కగా అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఇలాంటి ఎన్నో నియమాలతో పాటు కొంతమంది శుక్రవారం పూట డబ్బుల్ని ఎవరికి ఇవ్వరు. అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకం కాబట్టి చాలా మంది చాలా రకాల నియమాలు పాటిస్తారు. భగవంతుడి పాలకులపై కోపాన్ని ప్రదర్శించేవారింట్లో లక్ష్మీదేవి ఉండదు. శంఖం శబ్దం వినిపించని ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండాలని ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. అయితే తులసిని పూజించని చోట కూడా లక్ష్మీదేవి ఉండదని శ్రీ మహావిష్ణువు చెప్పాడు. అతిథులకు భోజనాలు పెట్టని ఇంట్లో, ఇల్లు కళకళలాడుతూ ఉండని ఇంట్లో, ఇల్లాలు కంటతడి పెట్టిన చోట కూడా లక్ష్మీదేవి నిలవదు. సూర్యోదయ సమయంలో భోజనం చేసేవారింట్లో, తడి పాదాలతో నిద్రపోయే వారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. తులసి దేవిని పూజించే ఇంట్లో, శంఖం ధ్వనించే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సాక్షాత్తు విష్ణుమూర్తే సెలవిచ్చాడు. శుక్రవారం రోజు ఇల్లాలు ఇల్లు దులుపుకుంటూ కూర్చుంటే లక్ష్మీ ఆరాధనకు సమయం సరిపోదు. అలాగే ఆరోజు మహిళలు ఇల్లు దులిపితే పనిభారం పెరుగుతుంది అంటారు. అందుకే శుక్రవారం పూట ఇల్లు దులపకూడదని అంటారు. సాధారణంగా చీపురు పట్టుకొనే భాగాన్ని నేలకు ఆనిచ్చి పెడితుంటాము. కుచ్చు భాగం నేలకు ఆనిచ్చి పెడితే పాడైపోతుంది అని అనుకొని ఇలా చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడూ కూడా కుచ్చు భాగాన్ని మాత్రమే నేలకు ఆనిచ్చి పెట్టాలి.

 చీపురుకట్టను నిలబడితే దరిద్ర దేవతను ఆహ్వానం పలుకుతున్నట్లే. అవసరానికి మించి చీపురుకట్టలను కొని ఇంట్లో నిల్వ ఉంచకూడదు. చీపురుకట్టను ఈశాన్యం మూల కానీ,ఆగ్నేయ మూలలో కానీ పెట్టకూడదు. నైరుతి వాయువ్య మూలల్లో పెట్టండి. చీపురు శని, రాహు యొక్క ఆయుధం. చీపురు,చాట ఒకే దగ్గర పెట్టకూడదు. అది ఇంటికి అరిష్టం. ఇంటి లోపల బయట కూడా ఒకే చీపురు ను వాడకూడదు. పూజ గదిలో చీపురును వాడకుండా ఏదైనా శుభ్రమైన  బట్టను ఉపయోగించాలి. సంధ్యా సమయానికి ముందుగానే ఇల్లును శుభ్రం చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: