దేవుడు లేనిదే ఈ సృష్టి లేదు. సృష్టిలో జీవిస్తున్న జీవరాశులు అంతా దేవుని ఆశీర్వాదం వలనే బ్రతుకుతున్నారు. అందుకే దేవునిపై మానవులకు చెప్పలేని భక్తి, ప్రేమ అభిమానం అని చెప్పాలి. అందుకే తమ భక్తికి గుర్తుగా దేవాలయాలను నిర్మిస్తూ ఉంటారు. పేరుకి ఎందరు దేవుళ్ళు ఉన్నా, ఎన్ని దేవాలయాలు ఉన్నా దేవుడు ఒకడే... దేవుడే చెప్పే విషయమూ ఒక్కటే. కానీ ఈ చిన్న విషయం తెలుసుకోలేక ఇంకా భూమి మీద మతం పేరుతో కొట్టుకుంటూ ఉంటారు. ప్రపంచంలో ఉన్న ఎన్నో దేవాలయాల్లో ఇండియాలోని అంద్రప్రదేశ్ లో వెలసి యున్న తిరుమల పుణ్యక్షేత్రం అంటే ఎంతో ప్రఖ్యాతి.

విదేశాల నుండి ఈయన దర్శనం కోసం తండోపతండాలుగా వస్తుంటారు. చిత్తూర్ జిల్లాలో తిరుపతి పట్టణంలో తిరుమల క్షేత్రం ఉంది. సంవత్సరం మొత్తంలో సీజన్ తో పని లేకుండా నిత్యం లక్షల సంఖ్యలో ఏడుకొండల స్వామిని దర్శించుకుని వెళుతుంటారు. ఇప్పుడు కరోనా కారణంగా  భక్తుల సందడి కొంచెం తగ్గింది అనే చెప్పాలి. అయితే ఇది కేవలం టీటీడీ తీసుకున్న నిర్ణయం మాత్రమే. ప్రతి నెల దర్శనం కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ లో టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా తిరుమలేశుని భక్తులకు టీటీడీ శుభ వార్త చెప్పింది. అయితే ఇంత కాలం వరకు కరోనా కారణంగా ఆన్లైన్ టికెట్లను కూడా తక్కువ సంఖ్యలో రిలీజ్ చేసేది.

కానీ కరోనా ప్రభావం తగ్గడంతో ఇప్పుడు టికెట్ లను పెంచడానికి నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 9 గంటల నుండి ఆన్లైన్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సారి టికెట్ల సంఖ్యను 25 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది టీటీడీ. అదే విధంగా ఆఫ్ లైన్ లో కూడా 20 వేల టికెట్లను అందుబాటులో ఉంచింది. ఇది నిజంగా భక్తులు అందరికీ మంచి వార్త అని చెప్పాలి. మీరు కనుక ఆన్లైన్ టికెట్లను బుక్ చేసుకోవాలి అనుకుంటే online.tirupatibalaji.ap.gov.in  అనే వెబ్ సైట్ ను సందర్శించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: