ఈ విభాగంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రమే కాకుండా వారికి తెలిసినా తెలియక పోయినా ఒక అనుమతి లెటర్ తో చాలా మంది ఈ సేవను ఉపయోగించుకుంటూ ఉండేవారు. దీని వలన సామాన్య భక్తులకు ఇబ్బంది అవుతోందని గమనించిన టీటీడీ పాలక మండలి ఈ విధానానికి చెక్ పెడుతూ నిర్ణయం తీసుకుంది. ఇక వీకెండ్ లో వీఐపి టికెట్ పై బ్రేక్ దర్శనాలు లేవు. ఇలా చేయడం వలన ఇంతకు ముందు వీఐపీల కోసం కేటాయించే కొంత సమయం కూడా ఇప్పుడు సామాన్య భక్తుల కోసం ఉపయోగం కానుంది. కాబట్టి ఇప్పుడు శుక్ర, శని మరియు ఆది వారాలలో సామాన్య భక్తుల కోసం అదనంగా టికెట్ల అందుబాటులో ఉంచనున్నారు.
అయితే ప్రస్తుతం మాత్రం ఒక రోజుకు 30 వేల టికెట్ల ఇస్తున్నారు. అయితే ఇప్పుడు బ్రేక్ దర్శనం లేదు కాంట్టి మరో కొన్ని టికెట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ విషయం గురించి తెలిసిన భక్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎప్పుడు నుండి అమలు అవుతుంది అనే విషయం తెలియాల్సి ఉంది.