తిరుమల శ్రీవారి భక్తులకు నిత్యం ఏదో ఒక శుభవార్త వస్తూనే ఉంటుంది. అది దర్శనానికి సంబంధించి కావొచ్చు, శ్రీవారి సేవల గురించి కావొచ్చు, టికెట్ ధరల గురించి కావొచ్చు. ఏదో ఒక వార్తను భక్తులకు టీటీడీ పాలక మండలి అందిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఇంకొక శుభవార్తను ఐఆర్సీటీసీ ట్రావెల్ సంస్థ ఇవ్వడం విశేషం. మామూలుగా ఇంతకు ముందు వివిధ రకాల ప్యాకేజీ లను శ్రీవారి భక్తుల కొరకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో అద్భుతమైన ప్యాకేజీ ని భక్తులను సంతోష పెట్టడానికి ముందుకు తీసుకు వచ్చింది. అయితే ఇది కూడా దేశంలో అందరికీ కాదు. కేవలం ఇండియా రాజధాని అయిన ఢిల్లీ లో నివసించే భక్తుల కోసం మాత్రమే అని ఐఆర్సీటీసీ ప్రకటించింది.

నిన్నటి నుండి మార్చి నెల ప్రారంభం కావడంతో ఈ నెలలో మూడు రోజులు ఈ ప్యాకేజీని అందుబాటు లోకి తీసుకువచ్చారు. మార్చి లో వచ్చే మొదటి శనివారం 5 వ తేదీ, 12 వ తేదీ మరియు 26 వ తేదీలలో మాత్రమే ఈ ప్యాకేజీ ఉంటుంది. శనివారం రోజున శ్రీవేంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు కాబట్టి మూడు తేదీలలో శనివారాలు ఉండేలా ఐఆర్సీటీసీ ప్లాన్ చేసింది. ఈ ప్యాకేజీ లో రెండు రోజులు మరియు ఒక రాత్రి ఉంటుంది. వారాంతంలో ఆ కలియుగ దైవాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాలి అనుకునే భక్తులకు ఇది అనువుగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇవ్వనుంది ఐఆర్సీటీసి. ఈ ప్యాకేజీ పై ఒక్క తిరుమల క్షేత్రం మాత్రమే కాకుండా తిరుచానూరు, పద్మావతి ఆలయం మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయాలను కూడా సందర్శించే సౌలభ్యం ఉంది.

ఈ ప్యాకేజీ లోనే దర్శనం టికెట్ కూడా కలిపి ఉంటుంది.  ఢిల్లీ లో ఈ భక్తులకు ఉదయం 8.35 గంటలకు విమానంలో బయలుదేరితే 11.30 గంటలకు చెన్నైకి చేరుకుంటారు. చెన్నై నుండి నేరుగా ఒక బస్ లో శ్రీకాళహస్తి చేరుకుంటారు... అక్కడ స్వామివారి దర్శనం పూర్తి అయ్యాక, తిరుపతిలో అప్పటికే ఐఆర్సీటీసీ బుక్ చేసిన హోటల్ లో దిగుతారు. అదే రోజు సాయంత్రం తిరుచానూరు దర్శనం అయిన తర్వాత మళ్లీ రూం కి చేరుకుంటారు. ఇక మిగిలిన రెండవ రోజు ఉదయం తిరుమల చేరుకుంటారు. అక్కడ ప్యాకేజీ లో ఇచ్చిన ప్రత్యేక దర్శనం టికెట్ ద్వారా శ్రీవారిని దర్శించుకుని తిరిగి హోటల్ కు చేరుకుంటారు. ఇక అదే రోజు రాత్రి చెన్నై లో 7.45 కి విమానం ఎక్కితే ఢిల్లీకి 10.45 కి చేరుకుంటారు.

అయితే ఈ ప్యాకేజీ పొందాలి అనుకునేవారు రూ. 15,660 చెల్లించి ముగ్గురు ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

రూ. 15,800 చెల్లించి ఇద్దరు మాత్రమే ఈ ప్యాకేజీ పొందగలరు.

రూ. 17,710 చెల్లించి కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే శ్రీవారి ప్యాకేజీని పొందగలరు.  

మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ సువర్ణావకాశం వినియోగించుకొని శ్రీవారిని దర్శించుకోండి


మరింత సమాచారం తెలుసుకోండి: