శ్రీవారి భక్తులకు ఒక షాకింగ్ న్యూస్... తిరుమలలో ప్రస్తుతం అన్ని దర్శనాల టికెట్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది టిటిడి. దాంతో ఒక్క సారిగా భక్తులు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే ఒకవైపు మూడేళ్లుగా పట్టి పీడించిన కరోనాతో ప్రజలు అలసి సొలసి పోయారు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ తమ ఇష్టకార్యాలకు సమయాన్ని కేటాయిస్తారు. ఇక చెప్పాలంటే ఎప్పుడూ కిటకిటలాడే దేవాలయాలు సైతం మూతపడ్డాయి. ముఖ్యంగా నిత్యం భక్తులతో కలకలలాడే తిరుమల కూడా కరోనా కారణంగా ఇన్నాళ్లు వెలవెల బోయింది. అంతే కాకుండా కరోనా కారణంగా ఈ రెండు మూడేళ్లలో తిరుపతిలో సైతం లాక్ డౌన్ దెబ్బతో దర్శనాలు కు ఆటకం ఎదురయ్యింది.

అసలు ఎన్నడూ లేని విధంగా శ్రీనివాసుని ఆలయాన్ని మూసివేశారు. ఇలా ఆ కరోనా పీరియడ్ లో ఏడుకొండల స్వామి భక్తులకు దర్శన భాగ్యం దక్కలేదు. కాగా ఇపుడు కరోనా వ్యాప్తి తగ్గడంతో తిరుమలలో తిరిగి దైవ దర్శనాలు, వేడుకలు మొదలవడంతో మళ్ళీ తిరుపతిలో రద్దీ ఎక్కువయ్యింది. అందులోనూ ఒకపూట బడులు కావడంతో భక్తులు ఎక్కువగా శ్రీనివాసుని దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటున్నారు. ఇలా ఒక్క సారిగా తిరుమలలో భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో తోపులాటలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం ఆలయంలో సర్వ దర్శనం టోకెన్ కేంద్రాల వద్ద భారీగా భక్తులు ఉండటంతో తోపులాట జరిగింది.  అక్కడ కొందరు భక్తులు గాయపడ్డారు.

దాంతో అక్కడి అధికారులు 5 రోజుల పాటు శ్రీవారి దర్శనానికి బ్రేక్ వేశారు. వరుసగా 5 రోజులు పాటు విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని టీటీడీ పీఆర్వో  వెల్లడించారు.
అధిక రద్దీ నేపధ్యంలో ఈ నెల తొమ్మిదవ తారీఖునే 12కి సంబంధించిన టోకెన్ల జారీ చేయగా... ఆది, సోమవారాల్లో టోకెన్ల జారీ ప్రక్రియని టీటీడీ తాత్కాలికంగా నిలిపి వేయాల్సి వచ్చింది. దీంతో టిక్కెట్లు తీసుకున్న భక్తులు రెండు రోజుల పాటు తిరుపతిలో వేచి ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ నెల 13 వ తేదీకి సంబంధించిన టోకెన్ల ప్రక్రియ నేటి ఉదయం నుండి ప్రారంభించారు. ఈ క్రమంలో వేచివున్న భక్తులు అలాగే రోజువారీ భక్తుల సంఖ్య భారీగా క్యూలలోకి చేరుకోవడంతో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: