1)అమరావతి శివాలయం: పల్నాడు జిల్లా అమరావతిలో గల ప్రసిద్ధ శివాలయం ఆంధ్రప్రదేశ్ పంచారమాలలో ఇది ఒకటి. ఈ ఆలయంలోని శివలింగాన్ని ఇంద్రుడు పత్రిష్ఠించాడని, త్రిపురాసుర సంహారసమయంలో కుమారస్వామి చేత విరగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించి అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్లు మరికొందరు చెబుతున్నారు. కాగా గుంటూరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉండగా, విజయవాడ, మంగళగిరి నుంచి కూడా వెళ్లొచ్చు.
2)కోటప్పకొండ: పల్నాడు జిల్లాలో చెప్పుకోదగ్గ మరో ప్రసిద్ధ క్షేత్రం కోటప్పకొండ. కైలాసాధినేత అయిన మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన సన్నిది ఈ కొండ. ప్రతీ ఏటా కార్తీక మాసంలో కోటప్పకొండ తిరుణాళ్లు, కార్తీక వన సమారాధనలు జరుగుతాయి. కాగా ఈ ఆలయంలో క్రీస్తుశకం 1172 లో చొళరాజైన కుళొత్తుంగా చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాలు ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని పాలించిన రాజులలో శ్రీకృష్ణ దేవరాయులు ఈ ఆలయానికి భూదానం చేశాడట. కోటప్పకొండ ఎత్తు 1587 అడుగులు. కోటప్పకొండకు నరసరావుపేట నుంచి ప్రతీ అరగంటకు ఓ బస్సు ఉంటుంది. అలాగే విజయవాడ, గుంటూరు వైపు నుంచి వచ్చే వాళ్లు చిలకలూరిపేట మీదుగా చేరుకోవచ్చు.
3)మల్లేశ్వరస్వామి: ఆంధ్రప్రదేశ్లోని శివాలయాల్లో శ్రీశైలం లింగాంశం కలిగి ఉండడంతో ద్వాదశ జ్యోతిర్గింగాలలో మహిమ ఇందులోనూ ఉన్నట్లే. మహర్షలోని అత్యంత ప్రసిద్ధి చెందిన భరద్వాజ మహాముని ఒకప్పుడు అన్ని తీర్థాలు సేవిస్తూ భూ ప్రదక్షిణలు చేస్తూ ఈ క్షేత్రానికి వచ్చాడు. మహర్షికి సమస్త సంభారాలను సమకూర్చి ఎందరో మహర్షులను ఆహ్వానించి ప్రారంభించారు. అక్కడికి ఒక కాకి వచ్చి మనుష్య భాషలో తాను కాకాసురుడనే రాక్షసుడని, బ్రహ్మదేవుడి వరం వలన తనకు హవిర్భాగాలను స్వీకరించే అర్హత దక్కిందని, నీ యజ్ఞం సఫలం కావాలంటే నన్ను అభిషేకించాలని కోరుతుంది. ఆ తరువా మహర్షి యజ్ఞం నీళ్లు కాకిపై చల్లగానే శ్వేతవర్ణంలోకి మారిపోతుంది. గుంటూరు జిల్లాలోని పెదకాకాని గ్రామంలో ఈ శివాలయం ఉంది. ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది.
4) శృంగేరీ శారదా పీఠం: ప్రముఖమైన హిందూ అద్వైత పీఠాలలో శృంగేరీ శారదా పీఠం ఒకటి. విద్యారణ్యుని గౌరవార్థం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రాజధాని నగరానికి విద్యానగరం అని పేరు పెట్టారు. క్రమంగా ఈనగరానికి విజయనగరం పేరు వచ్చింది. 1782 నుంచి 1799 వరకు శ్రీరంగ పట్నాన్ని రాజధానిగా చేసుకొని మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లింపాలకులు హైదర్ అలీ, అతని కుమారుడు టిప్పు సుల్తాన్లకు శృంగేరి శంకరాచార్యులపై చాలా గౌరవం ఉండేది. మరాఠీ సైన్యం వచ్చి రాజ్యంపై పడినప్పుడు శృంగేరీ మీద దాడి చేసిన పీఠాన్ని దోచుకున్నారు. శృంగేరీ పీఠానికి 120 పైగా శాఖలు భారతేశమంతా విస్తరించి ఉన్నాయి.
ఇలా ఏపీలోని ఈ దివ్యక్షేత్రాలు ఎంతో పవిత్రమైనవి. వీటి చరిత్ర బయట ప్రపంచానికి పెద్దగా తెలియకపోవడంతో జనాల రాక కొంచెం తక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ పురాతన క్షేత్రాలను జీవితంలో ఒక్కసారైనా దర్శిస్తే జన్మజన్మల భాగ్యం కలుగుతుందని నానుడి ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ ప్రసిద్ధ క్షేత్రాలను వీలైనంత తొందరలో సందర్శించండి.