గురువారం రోజున సాయిబాబా విగ్రహం కు ఆవు పాలతో పాలాభిషేకం చేయాలి. అంతే కాకుండా బాబాకు ఎంతో ఇష్టమైన ప్రసాదాలలో చపాతీ, పాల కోవ, కేసరి వంటి నైవేద్యాలను బాబాకు నైవేద్యం గా పెట్టాలి. బాబాను పన్నీరు రోజాలతో నిండుగా అలకరించాలి. ప్రత్యేకించి ప్రార్థించడమే కాకుండా, పూజ అయిన తర్వాత చిన్న పిల్లలను పిలిచి ప్రసాదాన్ని అందించాలి. పిల్లలకు బాబా ప్రసాదాన్ని అందిస్తే నేరుగా బాబాకి నైవేద్యం అందించినట్లే అవుతుంది. బాబాకు చిన్నారులు అంటే చాలా ఇష్టమట, అందుకే పిల్లలతో కాసేపు సంతోషంగా గడపాలి. చిన్నారులకు బాబా ప్రసాదాన్ని అందించడం ద్వారా మంచి ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్న మాట.
అలాగే గురువారం రోజున యాచకులకు అన్నదానం చేయడం చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే బాబా వారి రూపం లో మన కష్ట, నష్టాలను తీసుకుని మనల్ని అనుగ్రహిస్తారట. బాబా కు నేడు ధూప దీపాలతో వైభవంగా పూజించాలి. అలాగే గురువారం రోజున మాంసాహారం అసలు ముట్టరాదు. నిజానికి బాబాకు జీవ హింస అస్సలు ఇష్టం ఉండదు. ఈ విధంగా గురువారం రోజున ఈ నియమాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో బాబా ని పూజిస్తే అంతా మంచే జరుగుతుంది. ఇక ఈ రోజు సాయంత్రం బాబాను పూజిస్తూ ఆయన మంత్రోచ్చారణ చేస్తే అంత మంచి జరిగి మీరు అనుకున్న అన్ని కోరికలను ఆయన తీరుస్తాడట.