అయితే చాలా మందికి ఎందుకు అలా చేయకూడదు అని సందేహం కలుగవచ్చు. అయితే దీనికి శాస్త్రాలలో తగు కారణాలు చెప్పబడి ఉన్నాయి. శాస్త్రాలలో మహిళలకు సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పబడి ఉంది. మహిళలు తలస్నానం ఎప్పుడు చెయ్యాలి ? పీరియడ్స్ అప్పుడు ఏ వస్తువుల్ని తాకాలి ? కుంకుమ మరియు కంకణాలు అలంకరించుకునే నియమాలు ఇలా ప్రతి ఒక్కటి హిందూ శాస్త్రాలలో చెప్పబడి ఉంటాయి. కాగా గుడిలోకి తల విరబోసుకుని వెళ్ళకూడదు అని మన ఇంట్లో కూడా తరచూ చెప్పడం మీరు గమనించవచ్చు.
అయితే గుడికి వెళ్ళినప్పుడు మన మనసు అంతా దేవుడి మీదనే ఉండాలి. ఆయనను స్మరించుకునే సమయంలో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. మనసు మరియు శరీరం శ్వచ్చంగా ఉండాలి. ఇక పూజలో ఉన్న సమయంలో వెంట్రుకలు విరబోసుకుని ఉంటే అవి మనల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వాటిని సరిచేసుకోవడానికి సమయం అంతా సరిపోతుంది. అంతే కాకుండా జుట్టు విరబోసుకుని ఉంటే మీ పూజలు దేవుడి అంగీకరించరు అన్న విషయం కూడా ప్రచారంలో ఉంది. కాబట్టి స్త్రీలు గుడికి వెళ్ళే ముందు వెంట్రుకలు మంచిగా జడ వేసుకుని వెళ్ళాలి.