మన హిందూ ఆచారాల ప్రకారం చాలా మంది దేవుడిని ఎంత భక్తితో నమ్ముతారో అదే విధంగా మూఢనమ్మకాలను కూడా అంతే బలంగా విశ్వసిస్తారు . పిల్లి కానీ, వితంతువు కానీ ఎదురొచ్చినా,ఇంట్లో ఏదైనా జరగరానిది జరిగినా ఏదో కీడు జరగబోతుంది అంటూ పెద్ద ఎత్తున దిగులు చెందుతూ ఉంటారు.

ఇందులో భాగంగానే చాలా మంది ఇంట్లోకి పక్షులు వస్తే కీడు శంకిస్తుంటారు. మరీ ముఖ్యంగా గుడ్లగూబ కానీ, కాకి కానీ ఇంట్లోకి వస్తే అశుభం అని తలుస్తుంటారు.మరి ఇటువంటి పక్షులు ఇంట్లోకి అనుకోకుండా ప్రవేశించడం వల్ల ఎలాంటి దోషాలు కలుగుతాయో, వాటి పరిష్కారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పురాణాల ప్రకారం గుడ్లగూబ.. లక్ష్మీదేవికి వాహనం అయిన ఈ పక్షి ఇంట్లోకి రావడం అశుభంగా భావిస్తారు. గుడ్లగూబ పొరపాటున ఇంట్లోకి కనుక వస్తే ఆ ఇంట్లో సంపాదన ఉండదని, కుటుంబ వృద్ధి జరగదని,ఆ ఇంట్లోని వారికి అనేక కష్టాలు ఎదురవుతాయని వేద పండితులు చెబుతుంటారు. లక్ష్మి దేవీ వాహనం అయినా ఈ పక్షి ప్రభావం ఇంటి పై ప్రతికూల వాతావరణాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. కానీ మన హిందూ సంప్రదాయం లో కేవలం దీపావళి పండుగ రోజున మాత్రమే గుడ్లగూబ రాకను శుభంగా భావిస్తారు.మిగతా సమయంలో పొరపాటున ఎప్పుడైనా గుడ్లగూబ ఇంట్లోకి కనక వస్తే ఎర్రటి తిలకం కానీ,ఎర్రటి గుడ్డ ను కానీ దానం చేస్తే దాని వల్ల కలిగే దోషం నివారించబడుతుందని పండితులు సూచిస్తుంటారు.

కాకిని  శని దేవుడి వాహనంగా మన పురాణాల్లో చెప్పబడింది. కానీ అటువంటి కాకి ఇంట్లో కి రావడం చాలామంది అశుభంగా భావిస్తారు. కాకి ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఇల్లు కొద్దీ రోజుల పాటు వదిలి వేయాలని లేకుంటే శని ప్రభావం ఆ ఇంట్లో వున్న వారిపై ఉంటుందని భావిస్తారు. అయితే కాకి ఇంట్లోకి రావడం ఆ శుభంగా భావించినప్పటికి, కొన్నిసార్లు కాకి మన ఇంటి ముందు అరిస్తే శుభం కలుగుతుందని, బంధువులు వస్తారని పరిగణిస్తారు. అదే కాకి చెడు స్వరంతో అరిస్తే ఇంట్లోని వారికి ఏదో చెడు జరగబోతుందని పరిగణిస్తారు. ఏది ఏమైనప్పటికి ఇలాంటి పక్షులు ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో శాంతి పూజ చేసి, దోషాలను నివారించడం చాలా మంచిది.ఇంట్లో పూజ ఖర్చులు భరించలేనివారు గుడిలో శివునికి రుద్రాభిషేకం, కానీ తైలాభిషేకం చేయడం వల్ల ఆ పరమేశ్వరుని కృప వలన ఎలాంటి దోషాలైనా తొలగి సుఖశాంతులు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: