మన దేశంలో ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉంటాయి.. సాంప్రదాయాలకు సంబందించి ఆ గుడిలలో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.. ఇక అసలు విషయానికొస్తే..కర్ణాటకలోని ఒక ఆలయం మాత్రం ఏడాదిలో ఒక్క మూడు రోజులు తప్ప మిగిలిన రోజుల్లో మూతబడే ఉంటుంది. ధార్వాడ్‌లోని తబకడహోన్నల్లిలో ఉన్న ఈ ఆలయాన్ని.. దీపావళి సందర్భంగా సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే భక్తుల కోసం తెరిచి ఉంచుతారు.. తబకడహోన్నల్లిలో ఉన్న ఈ దేవాలయంలో హోలాలమ్మ దేవి కొలువై ఉంటుంది.కాగా, దీపావళి సందర్భంగా గుడి తెరుచుకున్నా, ఇక్కడ డెకరేషన్ కోసం విద్యుత్ దీపాలు వంటివి వెలిగించరు.
దీనికి బదులుగా ఇక్కడ ఉన్న శతాబ్దాల నాటి దీపాలను వెలిగించి, హోలాలమ్మ దేవి దర్శనం చేసుకుంటారు. సంవత్సరం మొత్తం లో మూడు రోజులే తెరిచి ఉండటంతో ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.. ఈ దేవాలయానికి సంబందించి ఎన్నో కథనాలు బయటకు వస్తున్నాయి. ఈ ఆలయంలో ని హోలాలమ్మ తల్లిని దర్శించుకుంటే కోరిక కోరికలన్నీ తీరుతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే పిల్లలు పుట్టని వారు ఈ మూడు రోజుల్లో పెద్ద సంఖ్యలో దైవ దర్శనానికి వస్తుంటారు. ఇన్ని ప్రత్యేకత లు ఉన్న హోలాలమ్మ అమ్మవారిని 'సంతానోత్పత్తి దేవత' అని కూడా అక్కడి ప్రజలు పిలుస్తారు.
వంధ్యత్వంతో బాధపడుతున్న చాలా మంది ఇక్కడకు వస్తారు.వారికి మంచి జరిగింది.. ఇకపోతే ఈ అమ్మవారికి మరో ప్రత్యేకత కూడా ఒకసారి గుడికి వచ్చిన భక్తుల కోరికలను అమ్మవారు నెరవేరిస్తే, వారు దేవాలయం తెరిచి ఉండే మూడు రోజుల్లో తప్పనిసరిగా పూజలు నిర్వహించాలి. ఇది కొన్ని వందల ఏళ్లుగా వస్తున్న ప్రత్యేకమైన ఆచారమని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఈ ఆలయం కొన్ని వందల ఏళ్ల నుంచి ఇక్కడ ఉందని గ్రామస్తులు చెబుతుంటారు. ఈ ఆలయం గురించి చరిత్రలో అయితే ఎటువంటి ఆధారాలు లేవు..