ఇండియా బంగ్లాదేశ్ పై వన్ డే సిరీస్ ను కోల్పోయిన తర్వాత రెండు టెస్ట్ ల సిరీస్ లో గట్టిగా ఆడి వైట్ వాష్ చేసింది. ఇప్పుడు రేపటి నుండి స్వదేశంలో శ్రీలంక తో మూడు టీ 20 లు మరియు మూడు వన్ డే ల సిరీస్ ను ఆడనుంది. మొదటి టీ 20 కి ముంబై లోని వాంఖడే స్టేడియం ఆతిధ్యం ఇవ్వనుంది. ఆ మ్యాచ్ రేపు సాయంత్రం 7 గంటలకు లైవ్ స్టార్ట్ కానుంది. ఇక టీ 20 లకు కెప్టెన్ గా హార్దిక పాండ్య మరియు వైస్ కెప్టెన్ గా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తమ బాధ్యతలను చూసుకోనున్నారు. మాములుగా ఐసీసీ టోర్నీలలో అంతగా ప్రభావం చూపించని టీం ఇండియా ద్వైపాక్షిక సిరీస్ లలో మాత్రం ప్రత్యర్థి ఎవరైనా గెలిచేలా ఆడుతుంది.

ఇక ఈ సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేయాలన్న కసితో బరిలోకి దిగనుంది. ఇక ప్రత్యర్థి గురించి మాట్లాడాల్సి వస్తే ఎటువంటి అంచనాలు లేకుండా ఆసియా కప్ లో టైటిల్ ను ఎగరేసుకుపోయింది. తమకన్నా బలంగా ఉన్న ఇండియా మరియు పాకిస్థాన్ లను సైతం ఓడించి కప్ ను సాధించి దేశం గర్వపడేలా చేశారు శ్రీలంక ఆటగాళ్లు. ఇక వరల్డ్ కప్ లోనూ ఆశాజనకమైన ప్రదర్శన చేసినా నాక్ అవుట్ స్టేజ్ కు అర్హత సాధించడంలో ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత శ్రీలంక లంక ప్రీమియర్ లీగ్ లాంటి దేశవాళీ లీగ్ లో మూడు వారాల పాటు ఆడి మంచి ప్రాక్టీస్ ను పొందారు.

ముఖ్యంగా దసున్ శనక, హాసరంగా, రాజపక్స, తీక్షణ మరియు అసలంకలతో కూడిన శ్రీలంక జట్టు బలంగానే ఉంది. ఇండియా ఆటగాళ్లు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా శ్రీలంకను అడ్డుకోవడం కష్టమే అవుతుంది. ఇక ఈ టీ 20 సిరీస్ లో ఇషాన్ కిషన్ , సూర్యకుమార్ యాదవ్, గిల్ మరియు హారిక లు రాణిస్తే క్లీన్ స్వీప్ చేయవచ్చు. మరి చూద్దాం ఈ సిరీస్ ను ఎవరు కైవసం చేసుకుంటారో ?      


మరింత సమాచారం తెలుసుకోండి: