మనిషి తమ జీవితంలో జ్ఞానం,డబ్బు బాగా సంపాదించి ఉన్నతస్థితికి చేరుకోవాలని ఆశిస్తాడు.కానీ కొంతమంది ఎంత కష్టపడి పనిచేసిన,జ్ఞానాన్ని సంపాదించాలి అనుకున్న, వారి పనులు సక్రమంగా జరగవు. అలాంటివారు పూజలో ప్రథమ దైవంగా పూజించే ఆ విగ్నేశ్వరుణ్ణి,సంకష్టహర చతుర్దశినాడు పూజిస్తే సర్వవిఘ్నాలు తొలగిస్తాడని పండితులు సూచిస్తూన్నారు. ఆ విఘ్నేశ్వరుని కృప వల్ల ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నతస్థితికి ఎదగగలరు. సర్వకష్టాలను తొలగించె ఆ సంకష్టహరచతుర్దశిపూజ ఎలా చేయాలో తెలుసుకుందామా..

 సంకష్టహరచతుర్దశి పూజ..
సంకష్టహరచతుర్దశి పూజ ప్రతినెలా కృష్ణపక్షంలో,పౌర్ణమి వెళ్లిన నాలుగవ రోజైన,చతుర్దశి నాడు చేసుకోవలెను.అసలు ఏంటి సంకష్టహరచతుర్దశి పూజ. విఘ్నేశ్వరునికి 32స్వరూపాలలో చివరిదైనా సంకష్ట రూపం విఘ్నేశ్వరికి మహాప్రీతి. అందువలన ఆ రోజున విగ్నేశ్వరుణ్ణి పూజిస్తే ఎంతటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది.
 
పూజా విధానము..
బహుళపక్షంలో చతుర్దశినాడు, తెల్లవారుజామున లేచి బకెట్ నీటిలో కొన్ని గింజలు నువ్వులు వేసి,ఆ నీటితో తలస్నానం చేయాలి.స్వామివారికి ఎర్రటి గుడ్డముక్క తీసుకొని, పసుపు,కుంకుమ వేసి,మూడు దోసెలతో బియ్యం వేసి రెండు తాంబూలాలు,దక్షిణ,ఖర్జురాలు వేసి ముడుపు కట్టాలి.ఆ తర్వాత స్వామి చుట్టూ 21 ప్రదక్షిణలు చేయాలి.ముడుపును సమర్పించే ముందు మన కోరికను బలంగా కోరుకొని సమర్పించాలి. ఈ పూజ చేసేవారు కటిక ఉపవాసం ఉండాలి. ఇందులో మరొక నియమం ఏమిటంటే ఆరోజు కచ్చితంగా మంచి మాటలే మాట్లాడాలి. అదే రోజు సాయంత్రం వేళ మళ్ళీ తలస్నానం చేసి, ఇప్పుడు వ్రతంను మొదలుపెట్టాలి. మొదటగా ఉదయం కట్టిన బియ్యంతో సాయంత్రం వేళ పాయసం, 21 కుడుములు చేసి, ప్రసాదంగా సమర్పించాలి. ఈ పూజలో మొదటిగా పసుపుతో వినాయకుడిని,గౌరీని చేసుకొని మొదలు పెట్టాలి.తర్వాత షోడపోచారపూజ, అంగపూజ, చేసి 21 పూలు మరియు 21 పత్రిని సమర్పించాలి. ఈ సంకటహరచతుర్దశి వ్రతంలో సంకటహర స్తోత్రమును చదువుకోవాలి. తర్వాత ఇంటికి ఎవరినైనా పిలిచి,మర్యాధులతో భోజనం పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలి. ఆ రోజు కచ్చితంగా బ్రహ్మచర్యము పాటించవలసి ఉంటుంది. ఇలా 21 సంకటహరచతుర్దశి పూజలు చేయడం వల్ల మనకున్న ఎంతటి కష్టమైనా ఇట్టే తొలగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: