అన్ని పదార్థాల కంటే ఉప్పుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.ఉప్పును హిందువుల ఇళ్లల్లో లక్ష్మీదేవికి ప్రతిరూపంగా చూసుకుంటారు. ఆ ఉప్పు పూర్తిగా అయిపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్టు భావిస్తారు.ఇలాంటి ఉప్పు వంటల్లో రుచిని పెంచడానికే కాక,ప్రతికూల శక్తులను పారద్రోలడానికి కూడా ఉపయోగపడుతుంది.
నిరుద్యోగసమస్య కు..
ఉద్యోగము కొరకు ఎంతో కాలంగా ప్రయత్నిస్తూ ఉన్నారా..? అలాంటివారు ఇంటిని శుభ్రం చేసేందుకు వాడే నీటిలో,కొంచెం ఉప్పు వేసి శుభ్రం చేయడం వల్ల ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోయి,అనుకున్న పనులు సజావుగా జరుగుతాయి.
దృష్టిదోషాలు తొలగించడానికి..
చిన్నపిల్లలు ఉన్న ఇళ్లల్లో వారు ఎక్కువగా అనారోగ్య సమస్యలు చుట్టూ ముట్టినప్పుడు,వారికి ఉప్పుతో దిష్టి తీసి, నీటిలో కలపడం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి.
డబ్బుకొరతతో బాధపడేవారు..
ఎవరి ఇళ్లల్లో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో, వ్యాపారాలలో నష్టం కలుగుతుందో, అలాంటివారు ఒక గిన్నెలో ఉప్పును నింపి,పసుపు కుంకుమ,పూలను వేసి ఈశాన్య మూలగా ఉంచుకోవాలి. అప్పుడు వారికి వారి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది.
మానసికఒత్తిడితో బాధపడేవారు..
పని వల్ల, మానసిక ఒత్తిడి అనుభవించేవారు, స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పును వేసి,తలస్నానం చేయడంతో,మానసిక ఒత్తిడి తగ్గి,ప్రశాంతత కలుగుతుంది.