శాస్ట్రాల ప్రకారం, వ్యాపారాలలో లాభాలు వచ్చి, కుటుంబంలో ఆనందం, శాంతి , అదృష్టాన్ని తీసుకువచ్చేందుకు తమలపాకులతో కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
1.తమలపాకులతో ఆంజనేయుడి అనుగ్రహం పొందవచ్చని వేద పండితులు చెబుతున్నారు.దాని కోసం ప్రతి మంగళవారం లేదా శనివారం రోజున తలస్నానం చేసి, ఇళ్ళు వాకిలి శుభ్రం చేసుకొని,, హనుమంతుని ఆలయంలో టెంకాయ, పసుపు కుంకుమలతో పాటు తాంబూలం తయారుచేసిన పాన్ దేవుడికి ప్రసాదంగా సమర్పించాలి. ఇలా పెట్టడం వల్ల, ఆంజనేయ అనుగ్రహం కలిగి వ్యాపార శక్తి పెరుగుతుందని చెబుతారు.
2.తమలపాకులకు ద్రుష్టి దోషాలను పోగొట్టే శక్తి ఉందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.శివున్ని కూడా తమలపాకులతో పూజించడం చాలా మంచిది,ఎందువలన అంటే శివుడికి తమలపాకులు ప్రసాదంగా పెట్టడం వల్ల శివుడు ప్రసన్నుడవుతాడని, భక్తుల కోర్కెలు తీరుస్తాడని ప్రజల నమ్మకం.ఈ పాన్ ను గుల్కంద, తమలపాకులు, సోంపు, ఖర్జురం గుజ్జు కలిపి పాన్ కట్టి దేవుడికి సమర్పించాలి. దీనితో వ్యాపారం పై వున్న ద్రుష్టి దోషాలు తొలుగుతాయి.మరియు వ్యాపారం విస్తరించాలనుకుంటే,మంగళవారం ఉదయాన్నే ఎవరూ చూడక మునుపే 5 మిరపకాయలు మరియు 8 తమలపాకులను ఒక దారంపై కట్టి, మీ షాప్ కు తూర్పు వైపున కట్టాలి.ఇలా వరుసగా 5 మంగళవారాలు కట్టాలి. ఇలా వాడిన ఆకులను తొక్కని ప్రదేశంలో పడేయాలి. ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి, వ్యాపార విస్తరణ జరుగుతుంది.