ఆ చెరువులో ఉండే నాగుపామును అక్కడి స్థానికులు అందరూ నాగదేవత అని పిలుచుకుంటూ ఉంటారు. ఇది మహిమాన్వితమైన సర్పమని.. కోరిన కోరికలను తీర్చుతోందని అక్కడి స్థానికులు కూడా ఎంతగానో విశ్వసిస్తూ ఉంటారు అని చెప్పాలి. అది ఎక్కడో కాదు ఝార్ఖండ్ రాజధాని అయిన రాంచీలోనే నామ్ లోమ్ లో మారాశీలి పర్వతం ఉంది. ఇక పర్వతంపై ఒక చిన్న చెరువు ఉంది. దాని పక్కనే నాగ దేవత ఆలయం కూడా ఉంటుంది. ఇక ఈ ఆలయం పక్కనే ఉన్న చెరువు గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయని చెప్పాలి.
అక్కడ నాగదేవత గుడి పక్కనే ఉన్న చెరువుని ఎప్పుడు ఎవరు తవ్వారు అన్నది ఎవరికి తెలియదు. ఇక ఆ చెరువులో ఉండే సర్పం కూడా కేవలం కొంతమందికి మాత్రమే అప్పుడప్పుడు దర్శనమిస్తూ ఉంటుందట. ఇంకో విశేషం ఏమిటంటే సాధారణంగా ఈత రానివారు చెరువులోకి దిగితే మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అలా జరగదట. ఏకంగా ఈత రాని వారు చెరువులోకి దిగిన కూడా ఎంతో సులభంగా ఒకవైపు నుంచి మరోవైపుకు చేరుకుంటారట. ఇక చెరువులో మహిమాన్వితమైన సర్పంతో పాటు ఇతర పాములు కూడా నివసిస్తాయి. అయినప్పటికీ అక్కడ ప్రజలు మాత్రం ఏమాత్రం భయపడరట. ప్రతిరోజు ఎంతోమంది భక్తులు అక్కడికి ప్రార్థనలు చేయడానికి వస్తూ ఉంటారు.