విరిగిపోయిన చీపురు :
సాధారణంగా చీపురును కూడా లక్ష్మిదేవిగా భావిస్తుంటారు.కానీ కొంతమంది స్త్రీలు ఇంట్లో విరిగిపోయిన చీపురు ఉన్నా సరే,దానితోనే పని జరుగుతుంది కదా అని,వాడేస్తూ ఉంటారు.కానీ దానివల్ల లక్ష్మి దేవికి ఆగ్రహం వచ్చి, ఇంటి నుంచి వెళ్ళిపోతుందని, మరియు కటిక దరిద్రం ఆవహిస్తుందని వేదపండితులు హెచ్చరిస్తున్నారు.కావున విరిగిపోయిన చీపురున ఎవరూ కూడా ఇంట్లో వాడ కూడదు.
పాదరక్షలు :
పాడైపోయిన చెప్పులు ఇంట్లోనే ఉంచుకోవడం వల్ల, పేదరికాన్ని తెస్తుంది.పెద్దలు కూడా ఎవరైనా చెప్పులు పోగొట్టుకుంటే దరిద్రం పోయిందని అంటుంటారు. అలాంటి చెప్పులు లేదా షూస్ ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగు తుందని అని పురాణాలు చెబుతున్నాయి. కావున అటువంటి పాదరక్షలు మీ ఇంట్లో ఉంటే విసిరి పారేయండి.
విరిగిపోయిన పాత్రలు..
కొంతమంది కొత్త పాత్రలు ఉన్నా కానీ,విరిగి పోయిన పాతర్లనే వాడుతూ ఉంటారు.దానివల్ల ఇంటి నిండా నెగటివ్ ఎనర్జీ నిండిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదని,దరిద్రం ఆవహిస్తుందని చెబుతూ ఉంటారు. కావున ఇంటి యజమానికి ధన సంపద పెరగాలి అంటే,ఇలాంటి పాత్రలు ఉంటే పడేయండి.
చిరిగిన బట్టలు..
ఇంట్లో గృహిణి చిరిగిన బట్టలు మాత్రం అస్సలు వాడకూడదు.అలా వాడటం వల్ల దరిద్ర దేవత ఆవహిస్తుంది.కావున ఇల్లాలు ఎంత శుభ్రంగా ఉంటే ఇంట్లో,అంతా పాజిటివ్గా ఉండి వారి ఇంట్లోకి ధన ప్రవాహం కలుగుతుంది.
వాడిపోయిన మొక్కలు..
కొంతమంది పని హడావిడిలో పడి,వాడిపోయిన మొక్కలు ఉన్నా సరె, వాటిని తీసేయకుండా అలాగే పెట్టి ఉంటారు. దానివల్ల కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించడానికి అంతగా ఇష్టపడదని చెబుతుంటారు. ముఖ్యంగా తులసి మొక్క,మనీ ప్లాంట్ వంటివి పాడైపోతే,వెంటనే తీసేయడం చాలా ఉత్తమం.