పురాణాల ప్రకారం దానాలు చేయడం వల్ల,వారి దోషాలు తోలుగుతాయని,మరియు అనేకమైన శుభఫలితాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు.స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి దానం చేయమని,వాటి వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయని బోధిస్తాడు.మరియు కొన్నిరకాల వస్తువులు దానం చేయడం వల్ల,ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయని ఉపదేశిస్తాడు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ముఖ్యంగా దేహి అని వచ్చిన వారికి అన్నము,నీరు ఇచ్చి,వారి ఆకలి తీర్చేవారికి స్వర్గలోకాలు ప్రాప్తిస్తాయని సందర్భానుసారం ఉపదేశిస్తాడు.ముక్యంగా అన్నింటిలోకి కన్నా అన్నదానం గొప్పదని,ఆకలితో వచ్చిన వారికి ఆకలి తీర్చడం కంటే గొప్పకార్యం ప్రపంచంలో ఏదీ ఉండదని కార్తీక పురాణం చెబుతోంది.అన్నము,నీరు అన్ని జీవులకు అతి ముఖ్యమైనవి.కావున వీటిని దానం చేసిన వారికి స్వర్గలోకాలను ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు.

ఎన్ని సంబంధాలు చూసినా,వివాహం కుదరక ఇబ్బందిపడుతూ ఉంటారు.అలాంటి వారు బంగారాన్ని ఎవరికైనా దానం చేస్తే,తొందరగా వివాహాధి కార్యక్రమాలు మొదలవుతాయి.బంగారు అగ్నితో సమానం కనుక,ఎలాంటి దోషాలైనా అగ్నితో బూడదయి,అనుకున్న పనులు సజావుగా జరుగుతాయి.మరియు చనిపోయిన తర్వాత కూడా మనకు స్వర్గలోకాలు అందాలంటే ఒక బ్రాహ్మణునికి గోవును దానం చేయడం మంచిది.ఎందుకంటే గోవుపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు వారికి స్వర్గలోకం దక్కుతుందట.దూడతో పాటు ఉన్న ఆవును దానం చేస్తే,వారి కుటుంబంలో 21 తరాలు స్వర్గలోకప్రాప్తి కలుగుతుందట.ఆ తర్వాత దానాలలో భూదానం గొప్పది. భూమి లేని వారికి భూదానం చేయడం వల్ల,  భూమి నుంచి మనకు వంటలు వస్తాయి కాబట్టి, భూధానం చేసిన వారికి సర్వసంపదలు కలిగి,సుఖ సంతోషాలతో  వుంటారు.

ఆ తర్వాత దానాలలో కన్యాదానం గొప్పదని చెప్పవచ్చు. కన్యాదానం చేయడం వల్ల ఒక వంశము వృద్ధి చెందడానికి తన ఆడబిడ్డను పంపించే తండ్రికి స్వర్గలోక ద్వారాలు తెరుచుకుంటాయని చెబుతారు. మరియు ఎవరికైనా విద్యాదానం చేయడం వల్ల,ఒక కుటుంబ వృద్ధికి కారణం అవుతారు కనుక,ఆ వ్యక్తికి సుఖసంతోషాలు తొందరగా లభిస్తాయని,ముఖ్యంగా స్త్రీలకు విధ్యాదానం చేయడం చాలా మంచిది. ఇంటికి దీపం ఇల్లాలు కనుక.దానం చేయడం వల్ల మనలో ఒక పాజిటివ్ వైబ్ కలిగి,సంతోషం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: