కొంతమందికి మంచి ఉద్యోగం,ఆర్థికంగా స్థిరపడినా కూడా,ఎన్ని సంబంధాలు వచ్చినా,వివాహ ప్రయత్నాలు ఫలిస్తూ ఉండవు.దానికి కారణం జాతకంలో కొన్ని రకాల దోషాలు మరియు ఇంట్లో వాస్తు దోషాలు కలిగి ఉండడమేనని వేద పండితులు చెబుతున్నారు.ఇలాంటి వారు కొన్ని పరిహారాలను చేసుకుంటే ఎలాంటి దోషాలైనా తొలగి,వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయని చెబుతున్నారు.
పసుపు కొమ్ములు..
మన హిందూ సంప్రదాయంలో పసుపు కొమ్ములకు పవిత్రమైన స్థానం ఉంది అని చెప్పవచ్చు.పసుపు కొమ్మును గౌరీదేవి ప్రతిరూపంగా భావిస్తారు.ఇలాంటి పసుపు కొమ్ములను మూడు తీసుకుని,పసుపు వస్త్రంలో మూట కట్టాలి.ఆ మూటను పెళ్లి కాని వారు తమ జేబులో కానీ,పరుసులో కానీ ఉంచుకోవడం వల్ల,వారికి ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో పెళ్లి సంబంధాలు తొందరగా సెట్ అవుతాయని వేద పండితులు సూచిస్తున్నారు.
బియ్యం పిండి..
ఎంతకీ పెళ్ళి సంబంధాలు సెట్ అవ్వక ఇబ్బంది పడే వారు ప్రతి గురువారం నానబెట్టిన బియ్యం తీసుకుని, మర పట్టించి,ఆ బియ్యప్పిండిలో చిటికెడు పసుపు,మరియు తగినంత బెల్లం వేసి,ఆవుకు దానాగా పెట్టాలి.ఇలా ప్రతి గురువారం చేయడం వల్ల,క్రమంగా జాతక దోషాలు ఏమైనా ఉంటే తొలగి,తొందరగా పెళ్లి ఫిక్స్ అవుతుంది.
విష్ణువు ఆలయ ప్రదర్శన..
విష్ణురూపాలలో ఏదో ఒక ఆలయానికి వెళ్లి,అక్కడ దేవుడికి,ఏడు చలిమిడి ముద్దలు నైవేద్యంగా పెట్టి,గుడి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చెయ్యాలి.ఆ ప్రసాదాన్ని అక్కడ ఉన్న భక్తులకు పంచాలి.ఈ పరిహారాన్ని ఏడు శనివారాలు పాటు పాటించడం చాలా ఉత్తమం.దీనితో విష్ణువు అనుగ్రహంతో తొందరగా పెళ్ళి సెట్ అవుతుంది.
పసుపు వస్త్రాలు దానం..
సాధారణంగా పెళ్లి సెట్ కాకపోవడానికి కారణం వారి జన్మతహ దోషాలలో కుజదోషం ఉండడమే. కుజదోషానికి నివారణగా పసుపు వస్త్రాలను దానం చేయాలి.కుజదోషం ఉన్నవారు ఏడు శనివారాల పాటు వారి ఆరాధ్య దైవానికి పూజలు నిర్వహించి,ఏడవ శనివారం రోజు పసుపు వస్త్రాలను,పసుపు రంగు పూలను,పండ్లను ఉంచి బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం వల్ల,దోషాలు తొలగుతాయని వేదపండితులు చెబుతున్నారు.కనుక పైన చెప్పిన దోష నివారణలు చేసి,తొందరగా పెళ్లి సెట్ చేసుకోవచ్చు.