రావి చెట్టు..
సాధారణంగా రావిచెట్టు చుట్టూ తిరిగితే సంతానం లేమి దోషాలు మరియు జాతక దోషాలు కూడా తొలగుతాయని చెబుతుంటారు.కానీ ఈ చెట్టు నీడ మాత్రం మన ఇంటిపై అసలు పడకూడదని,అలా పడితే ఇంట్లోని కుటుంబ సభ్యులు వృద్ధిలోకి రారని,దానితో వారి ఇంట్లో అప్పులు మరియు ఆర్థిక సమస్యలు అధికమవుతాయని హెచ్చరిస్తూ ఉన్నారు.
చింత చెట్టు..
ఆవరణలో చింత చెట్టు అస్సలు పెంచుకోకూడదట.దీని వలన ఇంట్లో ఒత్తిడి,గొడవలు అధికమై కుటుంబ సభ్యులకు మానసిక ప్రశాంతత లేకుండా క్షోభ అనుభవిస్తారని పెద్దలు హెచ్చరిస్తున్నారు.మరియు కుటుంబ పెద్ద ఆయుర్దాయం కూడా తగ్గిపోతుందట.
మామిడి చెట్టు..
మామూలుగా మామిడి ఆకులు ఇంటికి తోరణంగా కట్టడం వల్ల శుభాలు కలుగుతాయని భావించే మనము ఇంట్లో మాత్రం మామిడి చెట్టు అసలు పెంచుకోకూడదు. దీనివల్ల వాస్తు దోషాలు కలిగి సమస్యలు మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కావున జాగ్రత్తపడండి.
తుమ్మచెట్టు..
తుమ్మచెట్టు పొరపాటున కూడా మన ఇంటి ఆవరణలో పెరిగితే మాత్రం వెంటనే తీసేయాలి.లేకపోతే ఆ చెట్టుకున్న ముల్లుల వలె,మన ఇంట్లో కూడా ఎప్పుడు ఏదో బాధలు అనుభవిస్తూ ఉంటారు.ఒక్కసారి సమస్యలు వస్తే అస్సలు పోవట.
మునగ చెట్టు..
మునగ చెట్టు నుంచి వచ్చే మునగాకులు మరియు మునగకాయల వల్ల సంతాన సమస్యలు తొలగిపోతాయని అందరికీ తెలుసు.కానీ మునగ చెట్టును ఇంట్లో పెంచుకొని,దాని నీడలో భార్యాభర్తలు తిరగడంతో సంతాన సమస్యలు కలుగుతాయని హెచ్చరిస్తూ ఉన్నారు.కావున పిల్లల కోసం ఎదురుచూసే ప్రతి ఒక్కరూ ఈ చెట్టును ఇంటి ఆవరణలో అసలు పెంచుకోకండి.