సాధారణంగా ఇంట్లో వాస్తు దోషాల వల్ల కూడా ధనలక్ష్మి రావడానికి సంకోచిస్తుంది అని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే అలాంటప్పుడు మనం కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి అని..లేకపోతే లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి సందేహిస్తుంది అని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మనం ఇంట్లో ఎక్కువ సేపు ఉండే గదులలో వంటగది కూడా ఒకటి.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు అంటే కిచెన్ లో ఉండే ప్రతి వస్తువు కూడా వాస్తు ప్రకారమే ఉండాలి అని.. లేకపోతే రకరకాల అనర్ధాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ రాకుండా నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందో అప్పుడు ఇంటిలో కష్టాలు, మనుషుల మధ్య  మనస్పర్ధలు ఇలా ఎన్నో సమస్యలను చవిచూడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. డబ్బు కూడా నీటిలాగా వృధాగా ఖర్చవుతుంది. ఇకపోతే వాస్తు దోషాలు పోవడానికి, డబ్బు రావడానికి వంట గదిలో కొన్ని మార్పులు చేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా వంటగదికి అధిపతి కుజగ్రహం. అలాగే దక్షిణామూర్తి దీనిని అదుపులో ఉంచుతూ ఉంటారట.

ముఖ్యంగా వంటగదిలో ఉంచే సుగంధ ద్రవ్యాలు , కత్తులు, పాత్రలు, గ్యాస్ వంటివన్నీ కూడా అగ్నిదేవుడి ఆధీనంలో ఉంటాయి. కాబట్టి వంటగది ఎప్పుడు కూడా ఆగ్నేయ దిశలో ఉండాలి అని.. అందులో ఉంచే ఇతర వస్తువులను కూడా సరైన దిశలో ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే వంటగది డోర్ ఉత్తరం లేదా తూర్పు వైపు కలిగి ఉండాలి. తూర్పు దిశ నుంచి సూర్యకిరణాలు వస్తాయి కాబట్టి తూర్పు దిక్కు శ్రేయసుకు గుర్తు.. అందుకే వంట వండేవారు తమ ముఖాలను తూర్పుకు ఎదురుగా ఉండేలాగా చూసుకోవాలి. తూర్పు లేదా పశ్చిమం వైపు ఉండే కిటికీలను ఎప్పుడు తెరిచే ఉంచాలా. అలాగే గ్యాస్ సిలిండర్ ఆగ్నేయ దిశలో ఉంచాలట. ఖాళీగా ఉన్న గ్యాస్ సిలిండర్ను వాయువ్య దిశలో ఉంచాలని చెబుతున్నారు. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: