మన హిందూ సంప్రదాయంలో నాగల పంచమికి ప్రత్యేక గుర్తింపు ఉంది.ఆ రోజున శివుడి భక్తులైన నాగ దేవతలు వారి ఆనందం కోసం శివుడిని నాట్యమాడుతూ,పూజలు నిర్వహిస్తుంటారని ప్రసిద్ధి.అలాంటి రోజున పాములు కనిపించేవారు,ఆ పాములు వున్న పుట్టకు పూజలు నిర్వహించడం వల్ల స్వస్థత కలుగుతుందట.దానికోసం ఆ రోజున వారి ఇంటిని శుభ్రపరచుకొని,పాములకు ప్రీతికరమైన పాలు,గుడ్డు పూజకు కావాల్సిన సామాగ్రి తీసుకోవాలి.ఈ సమస్యతో బాధపడేవారు వెండితో కానీ, రాగితో కానీ తయారుచేసిన నాగుల వంటి విగ్రహాలు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి.వీటిని కూడా రెండు తీసుకోవాలి.
ఆ తర్వాత ఎక్కడైనా పుట్ట ఉన్న ప్రదేశాన్ని చూసుకోవాలి.ఆ ప్రదేశంలో ముందుగా శివునికి పూజ చేసి,అక్కడ పెట్టిన పూలు మరియు నాగలింగాలను తీసుకొని పుట్ట దగ్గరికి రావాలి.తరువాత అక్కడ ఉన్న మట్టిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి బొట్లు పెట్టి, నాగ ప్రతిమలను చేయాలి.ఇప్పుడు ఒక దారం తీసుకొని,పసుపు అంటించి ప్రతిమలకు వేయాలి. తరువాత మన తెచ్చుకున్న పాలు,గుడ్డు పాములకు సమర్పించి నాగలింగాలను పుట్టలో వేయాలి.ఇలా వేయడం వల్ల ఏదైనా దోనాగ దోషం కానీ, ఏదైనా పాములకు కలిగించిన అపాయపు తాలూకు పాలు కానీ తొలగి,పాములు కలలోకి రాకుండా ఉంటాయి.కావున మీరు ఈ సమస్యతో బాధపడుతున్నాట్లయితే తప్పకుండా ఈ నివారణ పాటించండి.