![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/spirituality/pisces_pisces/narasisti6ae3fcf3-940e-47a5-9826-705ef070daa9-415x250.jpg)
ఈ నివారణ కోసం ముందుగా స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎడమ కాలికి నలుపు దారం కట్టుకోవడం వల్ల ఇటువంటి చీడపీడలైనా మన వరకు రాకుండా ఉంటాయి.ముఖ్యంగా చిన్న పిల్లలకు నరదృష్టి కలగకుండా వారికి కచ్చితంగా ఎడమ చేతిలో కానీ,ఎడమ కాళీలో కానీ నల్లబొట్టు పెట్టడం,రోజూ సాయంత్రం ఉప్పుతో దిష్టి తీయడం వంటివి తప్పకుండా చేయాలి.
ముఖ్యంగా ఇంటిపైన నరదృష్టి పడటంతో మన ఇంట్లో అశాంతి నెలకొనడమే కాకుండా,అనుకున్న పనులు సజావుగా జరగవు.అలాంటివారు ముందుగా ఒక ఎర్రటి గుడ్డ తీసుకొని అందులో 11 రూపాయలను మరియు గుప్పెడు నల్లటి నువ్వులను వేసి,అందులోని నిమ్మకాయ కొంచెం పసుపు,కుంకుమ వేసి మూట కట్టి ప్రధాన గుమ్మానికి కట్టాలి.ఇలా కట్టుకోవడం వల్ల మన మనపై కానీ మన ఇంటిపై కానీ ఎలాంటి నడదృష్టి ఉన్నా కూడాఇంట్లోకి రాకుండా కాపాడుతాయి.ఇలా ఈ నరదృష్టి నివారణను అమావాస్య రోజు కానీ,ఏదైనా మంగళవారం పూట కానీ చేసుకోవడం చాలా మంచిది.
ఎవరైనా తమకి తాము నరదృష్టితో బాధపడుతున్నామని తెలిసిన వారు,వారు చేసే పనులు ఇతరులతో డిస్కర్షన్ చేయడం ఆపుకోవాలి.నరదృష్టి వల్ల కూడా కొన్ని పనులు జరగవు.కావున వారి పని జరిగేంతవరకు ఎవరితోనూ చెప్పకుండా ఉండడమే చాలా ఉత్తమం.మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నట్టయితే ఈ నివారణ పాటించడం వల్ల,తొందర్లోనే మీకు నరదృష్టి తొలగిపోతుంది.